King Cobra Rescue: ఎవడు మమ్మీ ఈడు.. 20 అడుగుల కింగ్ కోబ్రాను అమాంతం పట్టేసి లాక్కెళ్తున్నాడో..?

20 Feet King Cobra Rescue in Odisha: వామ్మో.. కింగ్ కోబ్రాను చూస్తేనే గుండె దడ దడ కొట్టుకుంటది. అందులోనూ 25 అడుగుల భారీ కింగ్ కోబ్రాను చూస్తే ఇంకేమైనా ఉందో గుండె ఆగిపోవాల్సిందే. అలాంటిది ఏకంగా ఆ 20 అడుగుల కింగ్ కోబ్రాను అమాంతం పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వివరాల ప్రకారం.. ఒడిశాలోని ఓ గ్రామ సమీపంలో 20 అడుగుల కింగ్ కోబ్రా తిరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పట్టేందుకు వెళ్లాడు. అక్కడ చెట్లపొదల్లోకి ఉన్న కింగ్ కోబ్రాను ఆ వ్యక్తి వెంటనే అమాంతం పట్టుకున్నాడు. దీనికి చూసిన అక్కడి స్థానికులు షాక్కు గురయ్యారు. వెంటనే ఆ కింగ్ కోబ్రాను పట్టుకుని వాహనంలో ఎక్కించాడు. ఈ సమయంలో ఆ వ్యక్తి బయపడకుండా కింగ్ కోబ్రాను పట్టుకొని అలా సరదాగా వచ్చేశాడు.
సదరు వ్యక్తి కనీసం ఎలాంటి రక్షణ కవచం లేకుండా పట్టుకున్నాడు. పొదల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా తలను అమాంతం పట్టేశాడు. అతినితో ఓ కర్ర కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కింగ్ కోబ్రాను తలను పట్టేసి.. అలా రోడ్డుపై నడుచుకుంటూ వచ్చేశాడు. దీంతో అక్కడి స్థానికులు అవాక్కయారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందే తెలియదు కానీ ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.