Home / ట్రెండింగ్ న్యూస్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో జోష్ తో కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లాలో సాగుతున్న జోడోయాత్రలో రుద్రారంలో రాహుల్ గాంధీ భారత్ జోడో గిరిజనుల సాంప్రదాయ నృత్యం ‘ధింసా’లో పాల్గొన్నారు.
ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం అయిన వాట్సాప్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. పెద్ద ఎత్తున వాట్సాప్ ఖాతాలపై వేటు వేసింది. సెప్టెంబర్ నెల వరకు దాదాపు 27లక్షల వాట్సాప్ అకౌంట్లపై నిషేధం విధించింది.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం సాయంత్రం ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. పర్యాటక ప్రాంతానికి చెందిన ఒక దృశ్యాన్ని పోస్ట్ చేసిన ఇదెక్కడిదో చెప్పుకోండి చూద్దాం అంటూ నెటిజన్లకు ప్రశ్న వేశారు.
అన్ని ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2021 నుంచి 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుతో సత్కరించడం మొదలుపెట్టింది. కాగా ఈ ఏడాది అక్టోబర్ నెల గానూ పురుషుల, మహిళల విభాగాల్లో నామినీల వివరాలను తాజాగా ఐసీసీ ప్రకటించింది. మరి టీమిండియా నుంచి ఈ గుర్తింపును ఏ ఆటగాడు పొందుతున్నాడో ఓ సారి చూసేద్దాం.
పాకిస్థాన్ లో స్థానికంగా ‘రియల్ ఫ్రీడమ్’ పేరుతో ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ గురువారం నాడు ఒక ర్యాలీ నిర్వహిస్తుండగా అతనిపై ఓ దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కాలికి గాయమైన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆ కాల్పులకు పాల్పడిన వ్యక్తి వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
తెలంగాణ సీఎం కేసిఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదిని ఢీ కొట్టేందుకు పూర్తి స్థాయిలో సమాయత్తమౌతున్నారు. ఇందులో భాగంగానే తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు ప్రలోభాల డీల్ వ్యవహారాన్ని దేశ వ్యాప్తంగా చాటి చెప్పేందుకు పక్కా ప్లాన్ వేశారు. దేశంలోని పలు రాష్ట్రాలకు నిందితుల ఆడియో, వీడియో టేపులను అందరికి పంపించారు.
తెరాస ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తమ పార్టీ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నించారంటూ నమోదైన కేసులో నిందుతులు కీలక అంశాలు పేర్కొన్నట్లు సీఎం కేసిఆర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటికి ఎనిమిది ప్రభుత్వాలను కూల్చామని, ఇప్పుడు ఇంకో నాలుగు ప్రభుత్వాలను కూల్చే పనిలో నిమగ్నమై ఉన్నామని నిందితులు తెలిపారన్నారు
రామ్ చరణ్,ఉపాసన కొంత విరామం దొరికితే విదేశాలకు వెళ్లి అక్కడ సరదాగా గడిపేస్తుంటారు. ఇటివల వాళ్లిద్దరూ 'టాంజానియా'లో షికారు చేసి అక్కడ తమకి నచ్చిన ఒక లొకేషన్లో ఫోటోలు దిగారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నేటింట్లో వైరల్ అవుతున్నాయి.
రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌కు చెందిన బీజేపీ ఎంపీ సీపీ జోషికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది.
క్రికెట్ దేవుడు, భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ రోడ్‌సైడ్ చాయ్‌ని ఎంజాయ్ చేస్తూ ఓ వీడియో నెట్టింట పోస్ట్ చేశాడు. క్రికెట్ కా గాడ్ తమ చిన్న దుకాణంలో టీ తాగడానికి రావడాన్ని చూసి ఆ టీ దుకాణదారు ఎంతో మురిసిపోయాడు.