Last Updated:

Diwali : దివాళి సెలెబ్రేషన్స్ కి సెలబ్రిటీలను ఆహ్వానించిన రామ్ చరణ్ .. అస్సలు దీపావళి అంటే ఇదే ..

దివాళి పండుగ అందరు చాలా గొప్పగా జరుపుకుంటున్నారు .అలానే టాలీవుడ్ సెలబ్రిటీలంతా దీపావళి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పలువురు సెలబ్రిటీలైతే మరింతమందిని పిలిచి గ్రాండ్ పార్టీలా చేసుకుంటున్నారు.

Diwali :  దివాళి సెలెబ్రేషన్స్ కి సెలబ్రిటీలను ఆహ్వానించిన రామ్ చరణ్ .. అస్సలు దీపావళి అంటే ఇదే ..

Tollywood Diwali : దివాళి పండుగ అందరు చాలా గొప్పగా జరుపుకుంటున్నారు .అలానే టాలీవుడ్ సెలబ్రిటీలంతా దీపావళి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పలువురు సెలబ్రిటీలైతే మరింతమందిని పిలిచి గ్రాండ్ పార్టీలా చేసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ లో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ఇంట్లో దీపావళి పార్టీని నిన్న రాత్రి గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు.తమ కూతురు క్లీన్ కారా కు తొలి దీపావళి కావడం తో వారి ఇంట్లోనే ప్రముఖుల మధ్య  గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు .  కాగా ఈ పార్టీకి టాలీవుడ్ లోని ఎందరో ప్రముఖ హీరోలు, ఫ్యామిలీలు, సెలబ్రిటీలు వచ్చారు. వారిలో మహేష్ – నమ్రత దంపతులు, ఎన్టీఆర్- ప్రణతి, వెంకీ మామ, సుధీర్ బాబు ఫ్యామిలీ, మంచు లక్ష్మి.. ఇలా పలువురు వచ్చి సందడి చేశారు. మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ ఈ పార్టీ ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

దీంట్లో ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, వెంకీ మామ, మహేష్ బాబు ఉండటంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. అలాగే ఉపాసన, నమ్రత, ప్రణతి ఉన్న ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది కదా దీపావళి స్పెషల్ ట్రీట్ అంటే అని టాలీవుడ్ ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోతున్నారు.ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే RRR మూవీ తరువాత ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీతో బిజీగా వున్నారు . డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఈ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా కోసం చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ అనేక కారణాలు వల్ల లేట్ అవుతూ వస్తుంది. సినిమా షూటింగ్ మొదలయ్యి రెండేళ్లు గడిచి పోయింది . అయిన ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూపులు ముగిసే రోజు త్వరలోనే రానుంది .