#Go Back Modi: గుజరాత్ మోర్బీ వంతెన కూలిన ఘటన దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను కలచివేసింది. ఇకపోతే ఈ ఘటనపై బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్రమోదీని ఇటు ప్రతిపక్షాలు, అటు నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. గతంలో ఇదే తరహాలో పశ్చిమ బెంగాల్ లో ఓ వంతెన కూలిన ఘటనపై మోదీ అప్పట్లో ‘ఆక్ట్ ఆఫ్ గాడ్ కాదు ఆక్ట్ ఆఫ్ ఫ్రాడ్’ ఇది అని చెప్తూ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. అయితే ఇప్పుడు గుజరాత్ బ్రిడ్జ్ కూలిన ఘటనకు ఎవరు బాధ్యులు అంటూ విపక్షాలు భాజపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.
ఈ తరుణంలోనే నేడు మోదీ మోర్బీ వంతెన కూలిన ఘటన స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లనున్నారు. దానితో ‘ గో బ్యాక్ మోదీ’ అంటూ ట్విట్టర్ వేదికగా నెటిజన్లు #Go_Back_Modiహాష్ ట్యాగ్ ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఓపక్క బ్రిడ్జ్ కూలి వందాలది మంది జనాలు మరణించి ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు నెలకొంటే.. మరోవైపు మోదీ పర్యటన నేపథ్యంలో మోర్బీ సివిల్ ఆస్పత్రికి రంగులు వేయడం, టైల్స్ వేయడం ఏంటంటూ ప్రధాని మోదీని నెటిజెన్లు విమర్శిస్తున్నారు. మోదీ ఇవేం పట్టించుకోకుండా ఎన్నికల ర్యాలీపై శ్రద్ధ చూపిస్తున్నారంటూ పలువురు నెటిజెన్లు విమర్శించారు. గుజరాత్ నుంచి బీజేపీని తరిమికొట్టాలంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇకలేరు