Emergency Day: ఇకపై ప్రతి సంవత్సరం జూన్ 25వ తేదీని ‘సంవిధాన్ హత్యా దివస్’గా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, జూన్ 25వ తేదీని సంవిధాన్ హత్యా దివస్‌గా పాటించడం భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఏం జరిగిందో గుర్తుచేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. భారత చరిత్రలో కాంగ్రెస్ చీకటి దశను ఆవిష్కరించిన ఎమర్జెన్సీ కారణంగా నష్టపోయిన ప్రతి వ్యక్తికి నివాళులర్పించాలని ఆయన పిలుపు నిచ్చారు.విధాన్ హత్యా దివస్’ పాటించడం వల్ల ప్రతి భారతీయుడిలో వ్యక్తి స్వేచ్ఛ మరియు మన ప్రజాస్వామ్య రక్షణ యొక్క శాశ్వతమైన జ్వాల సజీవంగా ఉంచడానికి సహాయపడుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దీని ద్వారా కాంగ్రెస్ వంటి నియంతృత్వ శక్తులు ఆ అటువంటి చర్యలను పునరావృతం చేయకుండా నిరోధిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను ప్రతి సంవత్సరం మనకు గుర్తు చేసే ఈ నిర్ణయం పట్ల ప్రధానమంత్రికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కేంద్ర మంత్రి మరియు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు.
కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకముంది..(Emergency Day)
మరోవైపు కేంద్రం నిర్ణయం పై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్‌తో కలిసిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పాలించింది. ఈ దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసాన్ని పునరుద్ధరించారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో బీజేపీ చాలా కలత చెందుతోంది. ఇప్పుడు ఎటువైపు వెళ్లాలో, ఏ ఆయుధాన్ని ప్రయోగించాలో అర్థం కావడం లేదు, అందుకే ఇప్పుడు ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నారు. .. వారు ఆందోళన చెందుతున్నారని తాను భావిస్తున్నానని కాంగ్రెస్ యుపి అధ్యక్షుడు అజయ్ రాయ్ అన్నారు.