PM Modi to be conferred by Guyana, Barbados top awards: ప్రధాని నరేంద్రమోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. విదేశీ పర్యటనలో ఉన్న ఆయనకు గయానా, డొమినికా దేశాల నుంచి అత్యున్నత పురస్కారం అందించాయి. ఈ మేరకు డొమినికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్.. ప్రధాని నరేంద్ర మోదీని ‘డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుత నరేంద్ర మోదీ గయానా పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగానే రెండు పురస్కారలను అందుకున్నారు.
‘డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్’పురస్కారం అందుకున్న తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కోవిడ్ 19 సమయంలో డొమినికా దేశ ప్రజలకు సహాయం చేసిన తర్వాత మనసు చాలా సంతృప్తినిచ్చిందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. ఈ గౌరవం నాది మాత్రమే కాదని, భారత్‌లోని 140 కోట్ల మంది ప్రజలదని వెల్లడించారు. ఈ పురస్కారం లభించడం గర్వకారణమన్నారు. ఈ అత్యున్నత పురస్కారం దేశ ప్రజలకు అంకితమిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రజల ప్రయత్నాలు, విలువలు, సంప్రదాయాలకు దక్కిందన్నారు. డొమినికా, భారత్ దేశాలు కలిసి ప్రపంచంలో మహిళా సాధికారతకు రోల్ మోడల్స్‌గా నిలిచాయని వ్యాఖ్యానించారు.డొమినికా రాష్ట్రంతో వాణిజ్య, విద్య, సాంకేతికత, సంస్కృతి సంబంధాలను బలోపేతం చేయాలని ప్రధాని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఇప్పటికే ప్రపంచ దేశాలకు మోదీ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇందుకు గానూ గయానా దేశం కూడా ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ను ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ఇర్ఫాన్.. ప్రధాని మోదీకి అందించారు. అయితే ఈ అవార్డు పొందిన నాలుగో విదేశీ నేత మోదీ కావడం విశేషం. అంతకుముందు ఈ అవార్డును విదేశీ నేతలు ముగ్గురు స్వీకరించారు. అనంతరం ప్రధాని మోదీ ఇఱు దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఈ అవార్డులను దేశ ప్రజలకు అంకితం ఇష్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.