Site icon Prime9

PM Modi: కంగ్రాట్స్.. డొనాల్డ్ ట్రంప్‌కి అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

PM Modi congratulates Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. హోరాహోరీ పోరులో ట్రంప్ చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ‘ హృదయపూర్వక అభినందనలు మిత్రమా’ అని ట్వీట్ చేశారు. ఈ విజయం అనంతరం భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకనుంచి భవిష్యత్ లో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

రెండు దేశాల ప్రజల అభివృద్ధి కోసం, ప్రపంచ శాంతి కోసం, ఇంకా ప్రపంచ శ్రేయస్సు కోసం కలిసి పని చేద్దామని పేర్కొన్నారు. గతంలో డొనాల్డ్ ట్రంప్ తో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. ఈ నేపథ్యంలో నెట్టింట పలు కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో హౌడీ, మోడీ!’,‘నమోస్తే మోదీ’ లాంటి కార్యక్రమాల్లో వీరిద్దరూ పాల్గొన్నారు. గతంలో ట్రంప్ పాలనలో భారత్-అమెరికా మధ్య సంబంధాలు మంచిగానే కొనసాగాయి. భవిష్యత్‌లోనూ అలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు.

Exit mobile version