Samsung Galaxy S24 Ultra Price Drop: అయ్య బాబోయ్.. స్మార్ట్‌ఫోన్‌పై రూ.34 వేలు డిస్కౌంట్.. కిల్లర్ రేటు బ్రో..!

Samsung Galaxy S24 Ultra Price Drop: సామ్‌సంగ్ తన కొత్త Galaxy S25 సిరీస్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నాలుగు ఫోన్లను లాంచ్ చేసింది . ఇందులో కెమెరా, బ్యాటరీ లైఫ్, డిజైన్‌లో మార్పులు, పర్ఫామెన్స్ అప్‌గ్రేడ్లు భారీగా జరిగాయి. అయితే ఇప్పుడు అమెజాన్ ఎటువంటి బ్యాంక్ ఆఫర్ లేకుండా ఎస్ సిరీస్ హై ఎండ్ డివైస్‌పై నేరుగా రూ.34 వేలు డిస్కౌంట్ ఇస్తుంది.
Samsung Galaxy S24 Ultra 5G Offers
వాస్తవానికి, అమెజాన్ గత సంవత్సరం ప్రారంభించిన S సిరీస్ హై-ఎండ్ డివైస్ Samsung Galaxy S24 Ultra 5Gపై పెద్ద తగ్గింపులను అందిస్తోంది. ఎలాంటి ఆఫర్ లేకుండా ఫోన్ పై నేరుగా రూ.34 వేలు తగ్గింపు ఉంది. ఫోన్ ప్రస్తుతం ప్లాట్‌ఫామ్‌లో కేవలం రూ. 1,01,999కి అందుబాటులో ఉంది.
అయితే కంపెనీ ఈ ఫోన్‌ను రూ. 1,35,999కి విడుదల చేసింది. కంపెనీ ఈ ఫోన్‌లో అనేక ప్రత్యేక AI ఫీచర్లను అందిస్తుంది, ఇది 2025లో కూడా ఉత్తమమైన హై ఎండ్ డివైజ్‌గా నిలిచింది. ఫోన్ కెమెరా చాలా ప్రత్యేకమైనది. దీనితో మీరు S పెన్ను కూడా పొందుతారు. ఇది వినియోగదారు అనుభవాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళుతుంది. ఈ ఫోన్ కొత్త ఐఫోన్‌తో నేరుగా పోటీపడుతుంది.
Samsung Galaxy S24 Ultra 5G Specifications
సామ్‌సంగ్ ఈ స్మార్ట్‌ఫోన్ పెద్ద 6.8-అంగుళాల QHD+ AMOLED ప్యానెల్‌ను పొందుతోంది, రిఫ్రెష్ రేట్ 120 Hz, పీక్ బ్రైట్నెస్ 2,600 nits. ఫోన్ భద్రత కోసం ఇందులో కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ ఉంది. మొబైల్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇది 12 GB RAM+ 1 TB స్టోరేజ్‌తో వస్తుంది.
పవర్ కోసం మొబైల్ 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అలానే Galaxy AI ఫీచర్‌లకు కూడా సపోర్ట్ ఇస్తుంది. రాబోయే వారాల్లో OneUI 7 అప్‌డేట్‌ను కూడా పొందుతుంది. Android 15-ఆధారిత OneUI 7 అప్‌డేట్ తర్వాత, స్మార్ట్‌ఫోన్ మరో 6 OS అప్‌డేట్‌లకు మద్దతు ఇస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే దీనిలో 200MP కెమెరా ఉంది. 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్‌ను పొందుతుంది. ఇది 3x ఆప్టికల్ జూమ్‌తో అదనపు 10MP టెలిఫోటో లెన్స్‌ను కూడా కలిగి ఉంది.