Published On:

Limited Time Offer: భారీ డిస్కౌంట్.. రూ.25 వేల రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లు తక్కువ ధరకే.. ఇంకా ఆలోచిస్తున్నారా..?

Limited Time Offer: భారీ డిస్కౌంట్.. రూ.25 వేల రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లు తక్కువ ధరకే.. ఇంకా ఆలోచిస్తున్నారా..?

Limited Time Offer: చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Realme భారతదేశంలో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌‌ను స్వాధీనం చేసుకుంది. రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లను భారతీయులు చాలా ఇష్టంగా కొంటున్నారు. కంపెనీ ఇటీవల తన P3 సిరీస్‌లో కొత్త ఫోన్‌లు Realme P3x 5G, Realme P3 Pro 5G, Realme P3 Ultraలను పరిచయం చేసింది. ఇవి IP69 రేటింగ్‌తో అద్భుతమైన పనితీరును అందిస్తాయి అయితే ఇప్పుడు కంపెనీ లిమిటెడ్ టైమ్ ఆఫర్ కింద 4000 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

Realme P3 Pro 5G Offers
రియల్‌మీ పీ3 ప్రో 5జీ కొనుగోలుపై నేరుగా రూ. 4000 డిస్కౌంట్ ఇస్తుంది. ఇంకా రూ. 19,999 ప్రారంభ ధరతో లభించే ఫోన్‌ను రూ. 2000 అదనపు బ్యాంక్ తగ్గింపుతో ఆర్డర్ చేయచ్చు.

 

Realme P3 Ultra 5G Offers
కస్టమర్లు అల్మా మోడల్‌ను రూ. 23,999 తగ్గింపు ధరతో ఆర్డర్ చేయచ్చు. ఈ ఫోన్‌లో వినియోగదారులకు 12జీబీ వరకు ర్యామ్, 256జీబీ వరకు వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. బ్యాంక్ ఆఫర్‌తో ఈ ఫోన్‌పై రూ. 3000 తగ్గింపు లభిస్తుంది. డీల్ ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 4 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌తో వస్తుంది.

 

Realme P3 5G Offers
రియల్‌మీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రూ. 15,499 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. దానిపై రూ. 1,500 బ్యాంక్ తగ్గింపు అందుబాటులో ఉంది. ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.ఇటీవల ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడైన రెండవ స్మార్ట్‌ఫోన్. ఇది మూడు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.

 

Realme P3x 5G Offers
కొత్త సిరీస్‌లో Realme P3x 5G అత్యంత సరసమైన ఫోన్. దీని ధర రూ. 1,000 బ్యాంక్ తగ్గింపు తర్వాత రూ. 12,999. ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, లూనార్ సిల్వర్,స్టెల్లార్ పింక్ కలర్ ఆప్షన్‌లలో విడుదల చేశారు. వినియోగదారులు దీనిని మల్టీ ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌లలో ఆర్డర్ చేయచ్చు.