Poco X6 5G: మస్త్‌గా ఉంది ఆఫర్.. పోకో 5జీ ఫోన్‌పై 32 శాతం డిస్కౌంట్.. మరీ ఇంత తక్కువా..!

Poco X6 5G: ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందుబాటులోకి తెచ్చింది. వాటిలో Poco X6 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్+256జీబీ, 12జీబీ ర్యామ్+256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. సేల్‌లో దీనిపై ఫోన్ ధరపై 32 శాతం వరకు ఆఫర్ ఇస్తుంది.

ఫ్లిప్‌కార్ట్  దీపావళి సేల్‌లో Poco X6 5G ఫోన్‌పై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 32ఛ శాతం ప్రత్యక్ష తగ్గింపుతో కొనుగోలు చేయచ్చు. ఈ మొబైల్ GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర 16,999. అదనంగా కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల నుండి డిస్కౌంట్లను కూడా పొందచ్చు. ఈమొబైల్ 5,100mAh కెపాసిటీ బ్యాటరీ బ్యాకప్ సదుపాయాన్ని కలిగి ఉంది. అదనంగా ఈ మొబైల్ Snapdragon 7 Gen 2 ప్రాసెసర్ పవర్‌తో పని చేస్తుంది. ఫోన్ ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

Poco X6 5G ఫోన్ AMOLED స్క్రీన్‌తో 6.67-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120Hz, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టాస్‌ ప్రొటక్షన్ ఉంది. అలాగే ఈ మొబైల్ Snapdragon 7 Gen 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.ఆండ్రాయిడ్ 14 OSకి సపోర్ట్ ఇస్తుంది.

దీనితో పాటు ఫోన్ 8 GB RAM + 256 GB, 12 GB RAM + 512 GB స్టోరేజ్ వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మెయిన్ కెమెరా 64 మెగా పిక్సెల్, 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాకూడా అందుబాటులో ఉంది. ఫోన్ పవర్ చేయడానికి అదనంగా 5,100mAh బ్యాటరీ ఉంది. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

మొబైల్ 1220 x 2712 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దాని డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1800 nits గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. అలాగే ఈ ఫోన్ డిస్‌ప్లే పిక్సెల్ డెన్సిటీ 446 ppiగా ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్షన్ 8300 అల్ట్రా ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.