Site icon Prime9

Redmi A4 5G Launch: వీడెవడ్రా బాబు.. రూ. 8,499లకే 5జీ ఫోన్.. ఫీచర్లు చూస్తే మాటల్లేవ్..!

Redmi A4 5G Launch

Redmi A4 5G Launch

Redmi A4 5G Launch: చైనీస్ టెక్ బ్రాండ్ షియోమి ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో తన సరికొత్త ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ Redmi A4 5Gని విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్ బడ్జెట్ ఫ్రెండ్లీ హ్యాండ్‌సెట్, ఇది అనేక గొప్ప స్పెక్స్ , ఫీచర్లతో వస్తుంది. ఫోన్‌లో గరిష్టంగా 50MP కెమెరా, 8GB RAM ఉంది. ఇందులో భారీ 5,160mAh బ్యాటరీ ఉంది. అలానే ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్ అనేక ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు, ఆఫర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

Redmi A4 5G Features
ఈ రెడ్‌మి A4 5G ఒక పొడవైన 6.88-అంగుళాల HD+ LCD ప్యానెల్‌తో ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 600 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ సరికొత్త బడ్జెట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 4s Gen 2 ప్రాసెసర్ ఉంది. ఈ ప్రాసెసర్ 4GB RAM+ 64GB లేదా 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్‌తో వినియోగదారులు 1TB వరకు స్టోరేజీని కూడా పెంచుకోవచ్చు.

అలానే ఈ ఫోన్ భారీ 5,160mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది 18W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. వెనుకవైపు  50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెకండరీ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీల కోసం మీరు 5-మెగాపిక్సెల్ కెమెరాను చూస్తారు. ఈ మోడల్ బరువు 212.35 గ్రాములు కాగా, ఇది 8.22 మిమీ సన్నగా ఉంటుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, ఎఫ్ఎమ్ రేడియో, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత షియోమి హైపర్‌ఓఎస్ కస్టమ్ స్కిన్ వంటి ఇతర ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.

Redmi A4 5G Price
షియోమీ Redmi A4 5Gని రెండు కలర్ ఆప్షన్లలో పరిచయం చేసింది. ఇందులో స్టార్రి బ్లాక్, స్పర్క్ల్ పర్పుల్ కలర్ ఉన్నాయి. అలాగే ఫోన్ రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ మోడల్ 4GB + 64GB ధర రూ. 8,499 కాగా, 4GB + 128GB వేరియంట్ ధర రూ. 9,499. షియోమి నవంబర్ 27, 2024 నుండి భారతదేశంలో Redmi A4 5G విక్రయాలను ప్రారంభించనుంది. ఇది బ్రాండ్  అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ ఇండియాలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

Exit mobile version