Home / ts latest news
TSPSC Leak: టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇదివరకే తొమ్మిది మందిని అరెస్టు చేశారు. టీఎస్పీఎస్సీ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Dharmapuri Arvind: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఎంపీ ధర్మపురి అర్వింద్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బండి సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని అర్వింద్ హితవు పలికారు.
MLA Rajaiah: స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మహిళ సర్పంచ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య మీడియాతో మాట్లాడారు.
TSPSC: పరీక్ష నిర్వహణలో హ్యాకింగ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. టీఎస్పీఎస్సీ కమిషన్కు సంబంధించిన గోప్యతతో కూడిన ఫైళ్లు కంప్యూటర్లో తెరిచి ఉన్నట్లు అనుమానించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
MLA Rajaiah: ఎమ్మెల్యే రాజయ్యపై మహిళ సర్పంచ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ నవ్య ఈ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
MLC Kavitha: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి దాదాపు 9 గంటలపాటు కవితను అధికారులు ప్రశ్నించారు. ఈనెల 16న మరోసారి విచారణకు రావాలని ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేశారు.
MLC Kavitha: ఉదయం నుంచి కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. దీంతో ఈడీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ నేతలను పోలీసులు.. అక్కడి నుంచి బయటకు పంపేస్తున్నారు. దాదాపు 8 గంటలుగా ఆమెను ప్రశ్నిస్తున్నారు.
Malla Reddy: ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పంగా మారాయి. బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల మంత్రి మల్లారెడ్డి స్పందించారు. కవితకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Revanth Reddy Comments: జగిత్యాల జిల్లాలో పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దిల్లీ మద్యం కుంభకోణలో ఈడీ తలచుకుంటే.. కవితను గంటలో అరెస్ట్ చేసి జైలుకి పంపవచ్చని అన్నారు. అలా చేయకుండా కేవలం పబ్లిసిటీ కోసమే.. బీజేపీ- బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలని ఆరోపించారు.
Woman Sarpanch: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయం వెడేక్కుతోంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ మహిళ సర్పంచ్ ఆరోపణలతో పెను ప్రకంపనలు మొదలయ్యాయి.