Home / Telangana
తెలంగాణలో 8ఏళ్లుగా ఉన్న ప్రశాంత వాతావరణాన్ని బీజేపీ చెడగొడతోందన్నారు హోంమంత్రి మహమూద్ అలి. ఎమ్మెల్సీ కవిత ఇంటి ముందు బీజేవైఎం నేతలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఆయన కవిత ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. భారీ భద్రత నడుమ నాంపల్లి కోర్టుకు తరలించారు. రెండురోజులకిందట రాజాసింగ్ అరెస్టు సందర్భంగా 41(A) సీఆర్పీసీ నోటీసులు ఇవ్వలేదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదంటూ రాజాసింగ్ తరపు లాయర్ అభ్యంతరం
గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి అరెస్టయ్యారు. రాజాసింగ్ ఇంటికి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయనను రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలుస్తోంది. ఓ వర్గం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రెండు రోజుల క్రితం రాజాసింగ్‌ను మంగళ్‌హాట్ పోలీసులు నాంపల్లి
హైదరాబాదీలను మెట్రో కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మెట్రోతో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టొచ్చనుకుంటే, ఇప్పుడు సీన్ కాస్త రివర్స్ అయింది. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు విరుగుడుగా మెట్రోను తీసుకొస్తే, అదే మెట్రో ఇప్పుడు సమస్యలతో సతమతమవుతోంది.
తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలను అగష్టు 26 న ప్రకటించనున్నారు. బీఈడీ విద్యార్థుల ప్రవేశ పరీక్షల కోసం ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఎడ్‌సెట్ పరీక్షకు హాజరైన విద్యార్థులు ఫలితాలు వెలువడిన తరువాత https://edcet.tsche.ac.in/ వెబ్సైట్ ద్వారా ఎడ్‌సెట్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
యాదగిరిగుట్ట లక్ష్మీనర సింహస్వామి బంగారు లాకెట్ల విక్రయాలు గత 2రోజుల నుంచి ప్రారంభమయ్యాయి. స్వామివారి రూపం, సుదర్శన నారసింహ యంత్రాన్ని లాకెట్ రూపంలో తయారు చేసి విక్రయించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇటీవల అనుమతి ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజ కీయ, శాంతిభద్రతల అంశం పై చర్చించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ప్రకంపణలు రేపాయి. అయితే తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కవిత కోర్టుకెక్కారు.
నల్గగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హిందిస్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
తెలంగాణ (హైద్రాబాద్ ) ఢిల్లీ మద్యం పాలసీలో తనపై తీవ్ర ఆరోపణలు చేసారని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సాపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం పరువునష్టం దావా వేశారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు 9వ చీఫ్ జడ్జ్ ముందు ఇంజక్షన్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటిషన్ దాఖలు చేశారు.