Home / Telangana
TG Assembly : సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని బీఆర్ఎస్ సభ్యులు బహిష్కరించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి సమాధానం ఇస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చావును కోరుకున్న నాయకుడి ప్రసంగాన్ని తాము బహిష్కరిస్తున్నామని వాకౌట్కు ముందు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ స్టేచర్‌పై నుంచి మార్చురీకే అని వ్యాఖ్యానించడం, తెలంగాణ సాధకుడు, 10 ఏండ్లు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిన పాలనాధక్షుడు అయిన కేసీఆర్ చావును […]
Telangana Assembly : కులానికి ఎక్కడా స్టేచర్ ఉండదని, మీకు మీరుగా స్టేచర్‌ను ఆపాదించుకోవద్దని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా మాట్లాడారు. గవర్నర్‌ను గౌరవించడం లేదని, స్పీకర్‌ను బీఆర్ఎస్ సభ్యులు గౌరవించడం లేదని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు ఎందుకిలా బరితెగిస్తున్నారని మండిపడ్డారు. అజ్ఞానాన్నే విజ్ఞానం అనేలా వ్యవహరిస్తున్నారన్నారు. కులానికి స్టేచర్ ఉండదని, ఒక్క పదవికి మాత్రమే స్టేచర్ ఉంటుందని, […]
Group-3 Results : తెలంగాణ రాష్ట్ర గ్రూప్-3 ఫలితాలను ఇవాళ టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ సందర్భంగా జనరల్ ర్యాంకులను సైతం విడుదల చేసింది. టీజీపీఎస్సీ కార్యాలయంలో ఫలితాలను చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. గ్రూప్-3లో పురుషుల్లో టాప్ ర్యాంకర్‌కు 339.24 మార్కులు వచ్చాయని టీజీపీఎస్సీ పేర్కొంది. గ్రూప్-3 మహిళా టాప్ ర్యాంకర్‌కు 325.15 మార్కులు వచ్చినట్లు తెలిపింది. మొదటి 36 ర్యాంకుల్లో ఒకే ఒక మహిళా అభ్యర్థి ఉన్నట్లు చెప్పింది. మొదటి 50 […]
MP Raghunandan Rao : తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. దేశ విదేశాల నుంచి స్వామివారి దర్శనాకి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దఎత్తున శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు. కానీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించకపోవడం ఇప్పుడు పెద్ద రచ్చగా మారింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినా.. టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకున్నా అమల్లోకి రాకపోవడంపై మెదక్ […]
Ration Cards : ఉగాది పండుగ తర్వాత ఏప్రిల్ మొదటి వారం నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. రెండు కేటగిరీలుగా విభజించి కార్డులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్డుల జారీలో కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని చెప్పారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు (బీపీఎల్) కార్డులు, ఎగువన ఉన్న పేదలకు (ఏపీఎల్) కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ విషయంలో […]
Remand prisoner dies : పోలీస్ కస్టడీలో ఉన్న రిమాండ్ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. పెద్దపల్లి జిల్లాకు చెందిన సంపత్ అనే యువకుడి మృతిపై బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు పెట్టిన చిత్రహింసల వల్ల తమ కుమారుడు పీఎస్‌లోనే మృతి చెందాడని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంపత్ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం […]
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘర్షణాకర పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సభలో స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. తాము ఎన్నుకుంటేనే మీరు స్పీకర్ అయ్యారని, సభ మీ సొంత కాదని జగదీశ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే […]
Half Day Schools : రాష్ర్టంలో ఎండలు మండుతున్నాయి. రాబోయే రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల సమయంపై కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ సందర్భంగా ఒంటిపూట బడులపై ఇవాళ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలు కొనసాగుతాయని పేర్కొంది. అనంతరం పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం అందిస్తారని చెప్పింది. […]
Telangana Budget Session 2025: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరిగింది. ఈ మేరకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రతిపాదించారు. అప్పులతో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.7లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. రాష్ట్రంలో శాస్త్రీయంగా కులగణన జరిగిందని, కులగణనలో కేసీఆర్ కుటుంబం పాల్గొనలేదన్నారు. కులగణనపై అభినందించకుండా విమర్శలు చేయడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వం కేవలం రైతుబంధు […]
Liquor Shops closed Holi festival on March 14 hyderabad: మందుబాబులకు మరో బిగ్ షాక్. ఇప్పటికే మద్యం ధరలు పెరిగిన నేపథ్యంలో ఆందోళన చెందుతున్న మందుబాబులకు పోలీసులు మరో బిగ్ షాక్ ఇచ్చారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఈనెల 14న మద్యం షాపులు బంద్ కానున్నాయి. హోలీ పండగ సందర్భంగా రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి వేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు […]