Home / Telangana
కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్‌రెడ్డి వ్యాఖ్యలను అద్దంకి దయాకర్ తప్పు బట్టారు. సీనియర్ నాయకుడిగా అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ గౌరవం తగ్గేలా మాట్లాడవద్దని విమర్శించారు. పీసీసీ, ఠాగూర్‌పై మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలన్నారు.
తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్‌షా పర్యటన ఖరారైంది. ఈ నెల 21న సాయంత్రం 4 గంటలకు మునుగోడులో జరగనున్న భారీ బహిరంగ సభకు అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌చుగ్ తెలిపారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని వాసవి గ్రూప్ ప్రధాన కార్యాలయంతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. 40కి పైగా ఐటీ బృందాలు 20 ప్రాంతాల్లో జరుగుతున్న తనిఖీల్లో పాల్గొన్నట్టు అధికారులు వెల్లడించారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదలైన బండి సంజయ్ పాదయాత్ర 1000కిలో మీటర్లు పూర్తి చేసుకుంది.జనగామ జిల్లాలోని అప్పిరెడ్డిపల్లెలో బండి సంజయ్‌కి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర 1000కిలో మీటర్లు పూర్తైన సందర్భంగా సంజయ్ అప్పిరెడ్డిపల్లెలో పైలాన్ ఆవిష్కరించారు.
కొత్త సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని ఆర్అండ్ బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్ లోని అన్ని విభాగాల పనులను అద్భుతంగా,
గుజరాత్ ప్రభుత్వం బిల్కిస్ బానో నిందితులను విడుదల చేయడంపం మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇంతటి దారుణానికి పాల్పడిని వాళ్లకు విడుదల చేయడం సరికాదన్నారు. ప్రధాని మోదీకి దేశం మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ విషయంలో కలుగజేసుకోవాలన్నారు. గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్‌ను వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కులం, మతం పేరుతో దేశాన్ని విడదీసే ప్రయత్నం జరుగుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లాలో పర్యటించిన సీఎం జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్ వద్ద కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంతాయిపల్లి పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
నేడు టీఎస్ లాసెట్ ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – 2022 రిజల్ట్స్ ను నేడు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ వీ. వెంకట రమణ,
గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా కూడా పదిరోజులు తిరగకముందే రైతుభీమా కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఏ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా, ఎవరికీ లంచాలు పొందే అవకాశం లేకుండా, నేరుగా బెనిఫీషియరీ ఖాతాలో జమ అవుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడ్డింది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి.. కొన్ని గంటల్లో తీరం దాటే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.