Home / Telangana
Rain Alert Telugu States: తెలుగు రాష్ట్రాల్లో అకాలవర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణతో పాటు ఏపీలోని యానాం, రాయలసీమ వంటి ప్రాంతాల్లో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, అక్కడక్కడ పిడుగులు కూడా పడొచ్చని హెచ్చరికలు జారీ చేసింది. కాగా, ఇప్పటికే నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, యాదాద్రిలో వర్షం పడుతోంది. కల్లాలు, వ్యవసాయ […]
SLBC Tunnel : ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో 8 మంది గల్లంతు కాగా, ఇద్దరి మృతదేహాలను వెలికి తీసిన విషయం తెలిసిందే. ఆరుగురి మృతదేహాలు ఇప్పటి వరకూ ఆచూకీ లభించలేదు. ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. గల్లంతైన వారి కోసం 63 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. తాత్కాలికంగా రెస్క్యూ ఆపరేషన్‌కు బ్రేక్ పడింది. ఇద్దరి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీయగా, మిగిలిన ఆరుగురి కోసం తవ్వకాలు జరుపుతున్నారు. సొరంగంలో నిరంతరం పనిచేసిన ఎక్స్కవేటర్లు […]
Hyderabad police issue notices to four Pakistanis : జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే పాక్‌కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇండియాలో ఉన్న పాకిస్థాన్ పౌరులు తక్షణమే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆదేశాలు జారీ చేశారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశాడు. రాష్ట్రాల్లో ఉన్న పాక్ పౌరులను తక్షణమే గుర్తించి వెనక్కి పంపాలని […]
28 Maoists killed in Encounter : తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల జరిగిన కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్టలో కేంద్ర పారామిలటరీ బలగాల నేతృత్వంలో 5 రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మావోల కీలక నేతలు హిడ్మా, దేవా లక్ష్యంగా ఆపరేషన్ జరుగుతోంది. ఆపరేషన్‌లో భాగంగా 3 రాష్ట్రాల నుంచి 20 వేల మందికి పైగా బలగాలు పాల్గొన్నాయి. ఈ క్రమంలోనే […]
Pakistan : జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాంలో ఈ నెల 22న జరిగిన ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపింది. దాడి నేపథ్యంలో కేంద్రం పాక్ పౌరుల విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. పాక్ పౌరులకు ఇచ్చిన వీసాలను కూడా రద్దు చేసింది. ఇండియాలో ఉన్న పాకిస్థాన్ పౌరులకు దేశం విడిచి వెళ్లాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల మేరకు దేశంలోని అన్నిరాష్ట్రాల్లో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. […]
ACB Raid : కాళేశ్వరం కమిషన్ విచారణ చివరిదశకు చేరుకుంది. ఈ క్రమంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజాము నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీగా ఉన్న హరిరామ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. షేక్‌పేట్‌లోని ఆదిత్య టవర్స్‌లో ఉన్న హరిరామ్ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆయన కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా, గజ్వేల్ ప్రాంత ఈఎన్సీగా విధులు నిర్వర్తించారు. కాళేశ్వరం అనుమతులు, రుణాల సమీకరణలో కీలకంగా వ్యహరించారు. కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ భార్య […]
CM Revanth Reddy : జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపాటు మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, భారత్ సమ్మిట్‌కు వచ్చిన విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. భారీసంఖ్యలో నగరవాసులు పాల్గొని పహల్గాం మృతులకు సంతాపం తెలిపారు. మరోసారి పాక్‌ను ఓడించాలి.. దేశంలోని […]
Telangana High Court : 2024 లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. కమలం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని వ్యాఖ్యానించాడు. బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు నమోదైంది. కేసును కొట్టేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ధర్మాసనంలో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లో తుదితీర్పు వెలువడే వరకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఎదుట హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని […]
Big Shock to Maoists – 14 Maoists Surrender in Warangal: మావోయిస్టులకు బిగ్‌షాక్ తగిలింది. ఇవాళ వరంగల్ పోలీసుల ఎదుట 14 మంది మావోలు లొంగిపోయారు. వరంగల్ మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి ఎదుట 14 మంది లొంగిపోగా, వారిలో ఆరుగురు మహిళా మావోలు ఉన్నారు. ఈ సందర్భంగా వారిని వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం ఐజీ వారికి రూ.25లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఐజీ మీడియాతో మాట్లాడారు. […]
Encounter at Chhattisgarh-Telangana State Border: ఛత్తీస్‌గఢ్- తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఎదురు కాల్పులు జరిగాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు దుర్మరణం చెందారు. కర్రెగుట్టల ప్రాంతంలో మూడు రోజులుగా భద్రతా బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ధర్మతాళ్లగూడెం వద్ద మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కర్రెగుట్టల […]