Home / Telangana
భారత్ - ఆసీస్ మ్యాచ్ టికెట్లు బ్లాక్‌లో అమ్మారనే ప్రచారం అవాస్తవని అజారుద్దీన్ అన్నారు. టికెట్ల విక్రయంలో హెచ్ సి ఎ ఎలాంటి తప్పు చేయలేదని, ఆన్లైన్లో టికెట్లు అమ్మితే బ్లాక్‌లో విక్రయం ఎలా సాధ్యం అవుద్దని ప్రశ్నించారు.
సాధారణంగా విమానాలు గాల్లో ఎగురుతాయని మనకు తెలుసు.. కాని అదే విమానం రోడ్డుపై వెళ్తే ఎలా ఉంటది. నమ్మశక్యంగా లేకపోయిన ఇది నిజంగా జరిగిన సంఘటన ఎక్కడ అనుకుంటున్నారా, ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో 8 మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. షబ్బీర్ అలీ , సుదర్శన్‌రెడ్డి అంజన్‌కుమార్ యాదవ్, రేణుకాచౌదరి, గీతారెడ్డి సహా మరో నలుగురికి నోటీసులు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వ తీరు పై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ నానాటికీ పడిపోతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తరపున ఆయన భార్య ఉషాబాయి మరోసారి హైకోర్టుని ఆశ్రయించారు. తెలంగాణ పోలీసులు రాజా సింగ్ పై నమోదు చేసిన కేసులను సవాల్ చేస్తూ ఆమె ఇప్పటికే హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
స్వచ్ఛ భారత్ మిషన్ లో దేశ వ్యాప్తంగా తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. వివిధ విభాగాల్లో 13 అవార్డులు రాష్ట్రానికి దక్కాయి.
తెలుగు వారు ఏ రంగంలోనై రాణించగలరు ఎన్ని రికార్డులైనా నెలకొల్పగలరు అన్నది నానుడి కాదండో అక్షరాల నిజం. సంపద సృష్టిలో తెలుగువాళ్లు రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తున్నారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ రిచ్‌లిస్ట్-2022లో మెరుగైన ర్యాంకులన్నీ మన తెలుగువారే సాధించారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ జోకర్ ట్వీట్ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నారని, ఆ మాటలు పట్టించుకోమన్నారు.
జింఖానా గ్రౌండ్మ లో క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాల సందర్బంగా చోటు చేసుకున్న పరిణామాల పై క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) బాధ్యతా రాహిత్యం వల్లే ఈ సంఘటన జరిగిందని ఆయన విమర్శించారు.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతుంది బీజేపీ. ఇందులో భాగంగానే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు.