Home / DGCA
ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎయిన్ ఇండియా పై పౌర విమానయాన నియంత్రణ సంస్థ ఫైర్ అయింది. నిబంధలను గాలికి వదిలేశారని పైలట్ పై 3 నెలల సస్పెన్షన్ వేటు వేసింది.
తదుపరి సూచనలు వచ్చే వరకు తక్షణమే విమాన టిక్కెట్ల అమ్మకాలను నిలిపివేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సోమవారం సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్ ఎయిర్‌లైన్ ను ఆదేశించింది.
ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ‘ఎయిర్ ఏసియా’ కు భారత విమానాయాన నియంత్రణ సంస్థ భారీగా జరిమానా విధించింది. పైలెట్ల శిక్షణ విషయంలో నిబంధనలు పాటించలేదని ఎయిర్ ఏసియా కు రూ. 20 లక్షల ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
దేశంలోని ఈశాన్య ప్రాంతాలకు కనీస తప్పనిసరి విమానాలను నడపనందుకు విస్తారా ఎయిర్‌లైన్స్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) రూ. 70 లక్జల జరిమానా విధించింది
అక్టోబరు 12న గోవా నుంచి వస్తున్న స్పైస్‌జెట్ విమానం క్యాబిన్లో పొగలు రావడంతో హైదరాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. దీనిపై డీజీసీఏ సోమవారం ఇంజిన్ ఆయిల్ నమూనాలను మెటల్ మరియు కార్బన్ సీల్ కణాల ఉనికిని తనిఖీ చేయాలని స్పైస్ జెట్ ను ఆదేశించింది.
పైలట్లు మరియు క్యాబిన్ సిబ్బందితో సహా విమానయాన సిబ్బంది అక్టోబర్ 15 నుండి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయించుకోవలసి ఉంటుంది. ఈమేరకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.
దేశంలో విమానయాన ట్రాఫిక్ నిరంతరం పెరుగుతోంది, జనవరి-జూన్ మధ్య కాలంలో దేశీయ విమానయాన సంస్థల ద్వారా ప్రయాణించే ప్రయాణీకులు 66.73 శాతం పెరిగి 343.37 లక్షల నుండి 572.49 లక్షలకు చేరుకున్నట్లు డీజీసీఏ గణాంకాలు తెలిపాయి.