Ap Police Recruitment 2022: జగన్ సర్కార్ తీపి కబురు.. పోలీస్ శాఖలో 6511 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. పోలీసు శాఖలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీపావళి కానుకగా 6,511 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Ap Police Recruitment 2022: ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. పోలీసు శాఖలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీపావళి కానుకగా 6,511 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో మొత్తం 26,431 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిన వైకాపా ప్రభుత్వం దశలవారీగా ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నియామకాల తొలిదశలో భాగంగా 6,511 ఉద్యోగాలకు ఈ ఏడాదే నోటిఫికేషన్ జారీ చేసేందుకు సీఎం జగన్ ఆమోదం తెలుపుగా.. ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా పోలీస్ శాఖలో ఖాళీలపై కసరత్తు చేసిన తర్వాత డీజీపీ కేవీ రాజేంద్రనాధ్ రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈమేరకు ఆ ప్రతిపాదనకు ఆమోదం ముద్ర వేసిన ప్రభుత్వం మొదటి విడతగా మొత్తం 6511 పోస్టుల నియామకానికి ఆదేశించింది. ఈ క్రమంలో ఏపీఎస్పీలో 2,520 కానిస్టేబుల్, 3,580 సివిల్ కానిస్టేబుల్, 315 సివిల్ ఎస్‌ఐ, 96 రిజర్వ్ ఎస్‌ఐ పోస్టుల భర్తీకి సీఎం జగన్ పచ్చజెండా ఊపారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 2019లో జరిగిన నియామకాల తర్వాత మళ్ళీ పోలీసు ఉద్యోగాల ఎంపిక జరగలేదు. గడిచిన మూడేళ్ళలో పదవి విరమణలు, పదోన్నతులు, ఇతర కారణాలతో పోలీసు శాఖలో ఖాళీలు ఏర్పడ్డాయి. పైగా 2019 తర్వాత కోవిడ్ సంక్షోభంతో నియామకాలు లేవు. వీటన్నింటి దృష్ట్యా పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది.
ఇదీ చదవండి: నెగెటివ్ మార్కింగ్ లేదు.. నిరుద్యోగులు త్వరపడండి.. ఎస్బీఐలో సర్కిల్ బేస్‌డ్ ఆఫీసర్ పోస్టులు