WTC Final: ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీలో ఈ రూల్స్ గురించి తెలుసా?
లండన్ వేదికగా జూన్ 7 న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా తో తలపడేందుకు టీమిండియా రెడీ అవుతోంది. స్వదేశంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ ను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లిన భారత జట్టు.. అదే దూకుడును డబ్ల్యూటీసీ ఫైనల్ లో కూడా కొనసాగించాలని భావిస్తోంది.
WTC Final: లండన్ వేదికగా జూన్ 7 న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా తో తలపడేందుకు టీమిండియా రెడీ అవుతోంది. స్వదేశంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ ను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లిన భారత జట్టు.. అదే దూకుడును డబ్ల్యూటీసీ ఫైనల్ లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. గత సీజన్ లో ఫైనల్ వరకూ వెళ్లిన టీమిండియా ఈ సారి టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించాలని చూస్తోంది. అదే విధంగా తొలి సారి డబ్య్లూటీసీ ఫైనల్ కు చేరిన ఆస్ట్రేలియా ఎలాగైనా టైటిల్ నెగ్గాలని చూస్తోంది. ఈ పోరు కోసం ఇరు జట్టు పోటాపోటీగా సాధన చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ గురించి ఆసక్తికర అంశాలేంటో చూద్దాం.
డబ్ల్యూటీసీ రూల్స్ ఎలా(WTC Final)
అన్ని ఫార్మాట్ల లానే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ లో ఎలాంటి నిబంధలను ఉన్నాయో చూద్దాం.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ సందర్భంగా వర్షం ఆటంకం కలిగించినా, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడినపుడు ఎక్కువ సమయం కోల్పోతే మాత్రమే మ్యాచ్ రిజర్వ్ డే వరకు వెళ్తుంది. లేదంటే 5 రోజుల్లో ఫైనల్ ముగిస్తుంది.
టెస్టు ఫైనల్ ఐదు రోజులు జరుగుతుంది. డబ్ల్యూటీసీలో రిజర్వ్ డే ను కూడా కేటాయించారు. ఈ 5 రోజుల ఆటలో వర్షం వల్ల ఎక్కువ సమయం కిల్ అయినా, రోజు మొత్తం ఆడకపోయినా ఆట రిజర్వ్ డే అయిన ఆరో రోజుకు వెళ్తుంది.
ఐదు రోజుల్లోనే మ్యాచ్ డ్రా గా ముగిస్తే.. ఇరు జట్లు కప్పును పంచుకుంటాయి.
ఒక వేళ రిజర్వ్ డే కూడా ఆటకు అంతరాయం ఏర్పడి.. మ్యాచ్ డ్రా అయితే.. రెండు జట్లను విజేతగా ప్రకటిస్తారు.
అదే విధంగా మ్యాచ్ టై అయినా రెండు జట్లు విజేతలుగా నిలుస్తాయి.
సాధారణంగా ఇతర ఫార్మాట్లో అయితే ఇలాంటి సందర్భాల్లో బౌండరీ కౌంట్లు, సూపర్ ఓవర్లు, లీగ్ దశలో ఎలా ప్రదర్శించారనే వాటిని పరిగణలోకి తీసుకుని విజేతను నిర్ణయిస్తారు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ లో మాత్రం అలా ఉండదు.
తొలిసారి ఢీ(WTC Final)
లండన్ లోని ఓవల్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మొదటి సారి ఢీకొట్టబోతున్నాయి. ఈ వేదికగా టీమిండియా ఇప్పటి వరకు 14 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఈ మ్యాచ్‌లన్నీ ఇంగ్లాండ్‌తో ఆడారు. ఇంగ్లాండ్ జట్టు 5 విజయాలు సాధించగా.. 2 మ్యాచ్‌ల్లో టీంఇండియా గెలుపొందింది. మిగిలిన 7 మ్యాచ్‌లు డ్రా గాముగిశాయి. ఈ మైదానంలో ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ 1936 ఆగస్టులో జరిగింది. అందులో ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. 2021 సెప్టెంబరులో భారత్ చివరి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో 157 పరుగుల తేడాతో గెలుపొందింది.
తాజాగా డబ్ల్యూటీసీ ఫైనలో భారత్ విజయం సాధిస్తే.. వన్డే, టీ20, టెస్టు మూడు ఫార్మాట్లలో వరల్డ్ ఛాంపియన్స్ గా నిలిచిన మొదటి జట్టుగా టీంఇండియా చరిత్ర సృష్టిస్తుంది. భారత్ ఇప్పటి వరకు వన్డే, టీ20 వరల్డ్ కప్ లో ఛాంపియన్స్ గా నిలిచిన విషయం తెలిసిందే.