Last Updated:

India vs Australia: ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్.. టాస్ ఓడిన భారత్

India vs Australia: ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్.. టాస్ ఓడిన భారత్

Australia Bat First in Champions Trophy Semi Final: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా కాసేపట్లో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య కీలక మ్యాచ్‌ జరగనుంది. దుబాయ వేదికగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మధ్యాహ్నం 2.30 నిమిషాలకు భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. ఈ మేరకు కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఇప్పటివరకు భారత్ 14వ సారి టాస్ ఓడింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మకు 11వ సారి కావడం గమనార్హం.

ఇక, భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆస్ట్రేలియా విషయానికొస్తే.. నలుగురు స్పిన్నర్లతో రంగంలో బరిలోకి దిగుతుంది. ఆడమ్ జంపాతో పాటు తన్వీర్ సంఘా, కూపర్ కొన్నెల్లీ, మ్యాక్స్ వెల్ స్పిన్నర్లతో పాటు లబుషేన్ కూడా స్పిన్ కమ్ పేసర్ బౌలర్ ఉన్నారు. ఐసీసీ టోర్నీల్లో ఆసీస్ తరఫున పిన్న వయస్కుడైన మూడో ఆటగాడు కూపర్ కొన్నెల్లీ బరిలో దిగుతున్నాడు. కూపర్ వయసు 21 ఏళ్ల 194 రోజులు కావడం విశేషం. ఓపెనర్లుగా కూపర్, ట్రావిస్ హెడ్ వచ్చారు.

భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

ఆస్ట్రేలియా జట్టు:
స్టీవ్ స్మిత్(కెప్టెన్), కూపర్ కొన్నెల్లీ, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ కేరీ, గ్లెన్ మ్యాక్ వెల్, బెన్ డ్వారి షూస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా.