Last Updated:

India vs Australia: ముగిసిన తొలిరోజు ఆట.. ఆస్ట్రేలియా భారీ స్కోర్

India vs Australia: ముగిసిన తొలిరోజు ఆట.. ఆస్ట్రేలియా భారీ స్కోర్

India vs Australia fourth test match Top order helps Australia big score: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్లు సామ్ కాన్ స్టాప్(60), ఖవాజా (57) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. లబుషేన్(71) దూకుడుగా ఆడాడు. అలాగే అలెక్స్ కేరీ 31 పర్వాలేదనిపంచగా.. మార్ష్ 4, హెడ్(0) నిరాశ పరిచారు. ప్రస్తుతం స్టీవెన్ స్మిత్(68), కమిన్స్(8) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. జడేజా, సుందర్, ఆకాశ్ దీప్ తలో వికెట్ తీశారు.

ఇదిలా ఉండగా, తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. మెల్ బోర్న్ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందనే కారణంతో బ్యాటింగ్ తీసుకుంది. అందుకు అనుగుణంగా ఓపెనర్లు శుభారంభం అందించారు. ఈ మ్యాచ్‌తో అతిచిన్న వయస్సులో ఎంట్రీ ఇచ్చిన సామ్ కాన్ స్టాస్ హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో అరంగేట్రం టెస్టుతో హాప్ సెంచరీ చేసిన రెండో ఆస్ట్రేలియా బ్యాటర్ గా రికార్డుకెక్కాడు. మరోవైపు భారత బౌలర్ బుమ్రా తొలి సెషన్‌ల ప్రభావం చూపలేదు. కానీ తర్వాత బంతి పాతగా మారే కొద్దీ రెచ్చిపోయాడు. ముగ్గురు కీలక బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు.దూకుడుగా ఆడుతున్న ఖవాజా(57) , మార్ష్(4 ), హెడ్(0)లను ఔట్ చేశాడు.