GT vs DC: బౌలింగ్ లో షమీ చెలరేగడంతో దిల్లీ తక్కువ పరుగులకే పరిమితమైంది. ఓ దశలో 25 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది దిల్లీ. ఈ క్రమంలో అమాన్ ఖాన్, అక్షర్ పటేల్ రాణించడంతో దిల్లీ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. అమాన్ ఖాన్ 51 పరుగులు.. అక్షర్ 27 పరుగులతో రాణించారు. చివర్లో రిపాల్ పటేల్ చెలరేగాడు.
గుజరాత్ బౌలింగ్ లో షమీ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మోహిత్ శర్మ రెండు వికెట్లు.. రషీద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
బౌలింగ్ లో షమీ చెలరేగడంతో దిల్లీ తక్కువ పరుగులకే పరిమితమైంది. ఓ దశలో 25 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది దిల్లీ. ఈ క్రమంలో అమాన్ ఖాన్, అక్షర్ పటేల్ రాణించడంతో దిల్లీ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. అమాన్ ఖాన్ 51 పరుగులు.. అక్షర్ 27 పరుగులతో రాణించారు. చివర్లో రిపాల్ పటేల్ చెలరేగాడు.
గుజరాత్ బౌలింగ్ లో షమీ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మోహిత్ శర్మ రెండు వికెట్లు.. రషీద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అమాన్ ఖాన్ అర్దసెంచరీతో రాణించాడు. 41 బంతుల్లో 50 పరుగులు చేశాడు.
దిల్లీ అతికష్టం మీద 100 పరుగులు దాటింది. అమాన్ ఖాన్ ఒక్కడే రాణిస్తున్నాడు.
దిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. మోహిత్ శర్మ బౌలింగ్ లో అక్షర్ క్యాచ్ ఔటయ్యాడు. అక్షర్ పటేల్.. 30 బంతుల్లో 27 పరుగులు చేశాడు.
12 ఓవర్లు ముగిసేసరికి దిల్లీ 61 పరుగులు చేసింది. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తున్నారు.
9 ఓవర్లు ముగిసేసరికి దిల్లీ 44 పరుగులు చేసింది.
పవర్ ప్లే లో దిల్లీ ఘోరంగా తడబడింది. 28 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది.
ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి దిల్లీ సగం వికెట్లు కోల్పోయింది. షమీ నిప్పులు చెరిగే బంతులతో నాలుగు వికెట్లు తీశాడు. రియాన్ గార్డ్ 10 పరుగులకు షమీ బౌలింగ్ లో ఔటయ్యాడు.
దిల్లీ వరుస వికెట్లు కోల్పోతుంది. షమీ బౌలింగ్ లో పాండే కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో ప్రియమ్ గార్గ్, అక్షర్ పటేల్ ఉన్నారు.
దిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్ లో రూస్సోవ్ కీపర్ క్యాచ్ రూపంలో ఔటయ్యాడు. క్రీజులోకి మనీష్ పాండే వచ్చాడు.
హర్దీక్ పాండ్యా వేసిన రెండో ఓవర్లో 10 పరుగులు వచ్చాయి.
రెండో ఓవర్లో దిల్లీ వికెట్ కోల్పోయింది. లేని పరుగు కోసం ప్రయత్నించి వార్నర్ రనౌటయ్యాడు.
తొలి ఓవర్లో దిల్లీ ఐదు పరుగులు చేసింది. క్రీజులో వార్నర్, ప్రియమ్ గార్గ్ ఉన్నారు.
దిల్లీ క్యాపిటల్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్ లో సాల్ట్ క్యాచ్ ఔటయ్యాడు.
మహమ్మద్ షమీ తొలి ఓవర్ వేస్తున్నాడు.
వృద్ధిమాన్ సాహా, అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, మొహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాష్ లిటిల్
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, మనీశ్ పాండే, రైలీ రోసో, ప్రియమ్ గార్గ్, రిపాల్, అక్షర్ పటేల్, అమన్, కుల్దీప్ యాదవ్, నోకియా , ఇషాంత్ శర్మ
ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన దిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.