Last Updated:

David Warner: రోహిత్‌ శర్మ రికార్డు బద్దలు కొట్టిన డేవిడ్ వార్నర్.. అదేంటో తెలుసా?

David Warner: ఐపీఎల్ లో డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ పేరు మీదున్న రికార్డును వార్నర్ అధిగమించాడు.

David Warner: రోహిత్‌ శర్మ రికార్డు బద్దలు కొట్టిన డేవిడ్ వార్నర్.. అదేంటో తెలుసా?

David Warner: ఐపీఎల్ లో డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ పేరు మీదున్న రికార్డును వార్నర్ అధిగమించాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా డేవిడ్ రికార్డులకెక్కాడు.

 

డేవిడ్ వార్నర్ రికార్డ్.. (David Warner)

ఐపీఎల్ లో డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ పేరు మీదున్న రికార్డును వార్నర్ అధిగమించాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా డేవిడ్ రికార్డులకెక్కాడు.

ఐపీఎల్ లో డేవిడ్ వార్నర్ కు మంచి రికార్డు ఉంది. ఏ జట్టుకు ఆడినా.. తన బ్యాటింగ్ తో ప్రేక్షకులను అలరిస్తాడు వార్నర్.

అయితే ఐపీఎల్ లో రోహిత్ శర్మ పేరు మీద ఉన్న రికార్డును వార్నర్ బద్దలు కొట్టాడు.

కేకేఆర్‌పై 26 మ్యాచ్‌లు ఆడిన వార్నర్.. 146 సగటుతో 1042 పరుగులు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(1040) పేరిట ఉండేది.

తాజా మ్యాచ్‌తో రోహిత్‌ రికార్డును వార్నర్‌ బ్రేక్‌ చేశాడు. ఇక రోహిత్‌ తర్వాతి స్థానంలో 850 పరుగులతో శిఖర్‌ ధావన్‌ ఉన్నాడు.

ఇక ఈ సీజన్ లో దిల్లీ తొలి విజయాన్ని అందుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.

128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ.. తడబడుతూ విజయాన్ని అందుకుంది. పవర్ ప్లే లో ధాటిగా ఆడిన.. మధ్యలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

చివరికి అక్షర్ పటేల్ క్రీజులో ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు.

ఇక ఈ విజయంలో డేవిడ్‌ వార్నర్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 41 బంతులు ఎదుర్కొన్న వార్నర్‌ 11 ఫోర్లతో 57 పరుగులు చేశాడు.

ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో చెలరేగిన వార్నర్‌.. ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

 

ఈ సీజన్ లో వరుసగా ఐదు మ్యాచుల్లో దిల్లీ ఓడిపోయంది. ఆరో మ్యాచ్ లో కోల్ కతా పై చివరి వరకు పోరాడి విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో దిల్లీ జట్టు చివరి స్థానంలో కొనసాగుతుంది.

ఈ సీనజ్ ని ఆ జట్టు ఎలా ముగిస్తుంది వేచి చూడాలి మరి.