Matti Kusthi Movie Review భార్యాభర్తల చిలిపి కొట్లాటగా “మట్టి కుస్తీ”.. మూవీ రివ్యూ ఇలా..!
Cast & Crew
- విష్ణు విశాల్ (Hero)
- ఐశ్వర్యలక్ష్మి (Heroine)
- గజరాజ్, కరుణాస్, కాళీ వెంకట్, రెడిన్ కింగ్స్లీ, హరీష్ పేరడి, అజయ్, శత్రు, మునిష్కాంత్,శ్రీజ రవి (Cast)
- చెల్లా అయ్యావు (Director)
- రవితేజ (Producer)
- జస్టిన్ ప్రభాకరన్ (Music)
- రిచర్డ్ ఎం. నాథన్ (Cinematography)
Matti Kusthi Movie Review: ఒక గ్రామీణ పల్లెటూరులో జరిగే కథగా ఈ సినిమాగా “మట్టికుస్తీ”ని చెప్పవచ్చు. తమిళంలో హిట్ గా నిలిచిన ఈ సినిమాను తెలుగులో మాస్ మహారాజా రవితేజ నిర్మించారు. ఎలాంటి లక్ష్యం లేకుండా వీర ( విష్ణు విశాల్) అనే వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పులు చేటుచేసుకుంటాయి తను ఎందుకు కుస్తీలో పాల్గొంటారు అనే కథతో మొత్తంగా భార్యభర్తల పోట్లాటగా ఈ మూవీని చెప్పవచ్చు.
లక్ష్యం లేని వ్యక్తికి వారి కుటుంబం వివాహం చేయాలనుకుంటుంది. కానీ ఆ వ్యక్తి అనిగిమని ఉండే భార్యను వివాహం చేసుకోవాలని భావిస్తాడు. చివరికి కీర్తి ( ఐశ్వర్య లక్ష్మి) అనే అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. అయితే ఆమె అణిగిమనిగి ఉండే అమాయకురాలని అనుకుంటాడు. కానీ అమ్మాయి దీనికి పూర్తిగా వ్యతిరేకం. తరచు గ్రామాల్లో ఉండే ప్రతి గొడవల్లో తలదూరుస్తుంది. వారి కుటుంబం దగ్గర అమాయకంగా నటిస్తుంది. చివరికి ఈ విషయం వారికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది. వీరిద్దరూ కలిసి ఉంటారా. కుస్తీ క్రీడలో వీర పాల్గొనడానికి కారణం ఏంటి అనేది సినిమా చూస్తే కానీ అర్థం కాదు.
వీరా క్యారెక్టర్ లో విష్ణు చాలా బాగా నటించారు. మొదటి భాగం కంటే రెండో భాగం అద్భుతంగా ఆకట్టుకుంటుంది. మొదటి భాగంలో కాస్త కామెడీ సన్నివేశాలు ఉన్నా రెండో భాగంలో ఆయన కుస్తీ చేయడానికి నిర్ణయం తీసుకుంటాడు. ఇక అప్పటినుంచి కథ ఆసక్తికరంగా మారుతుంది. ఇందులో ముఖ్యంగా ఐశ్వర్య లక్ష్మీ తన నటనతో చాలా ఆకట్టుకుంటుంది. ఓ వైపు దూకుడు మరోవైపు అమాయక అమ్మాయిగా రెండు కోణాల్లో అందరిని మెప్పిస్తుందని చెప్పవచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసే కామెడీ ఇందులో ఉంది. జస్టిస్ ప్రభాకరన్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని చెప్పవచ్చు. మొత్తానికి మట్టి కుస్తీ ఓసారి కంపల్సరిగా చూడవచ్చు.
ప్లస్ పాయింట్స్ :
కామెడీ
ఎమోషన్స్
మైనస్ పాయింట్స్ :
పాటలు
సాంకేతిక నిర్మాణం
రొటీన్ స్టోరీ
ఇదీ చదవండి: సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్లు వచ్చేసాయి..