Black Panther Wakanda Forever Movie Review: మార్వెల్ స్టూడియోస్ సమర్పిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్’ నేడు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. 2018లో వచ్చిన ’బ్లాక్ పాంథర్’ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. మొదటి భాగం ఊహించిన దాని కంటే ఎక్కువ సక్సెస్ కావడంతో పాటు అవెంజర్స్: ఇన్‌ఫినిటీ వార్, అవెంజర్స్: ఎండ్ గేమ్ సినిమాల్లో బ్లాక్ పాంథర్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌ల్లోని యాక్షన్ సీన్లకు మంచి రెస్పాన్స్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా చూడడానికి సినీలవర్స్ ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ మూవీకి పబ్లిక్ టాక్ ఏంటో చూసేద్దామా.
కథ
గతంలో బ్లాక్ పాంథర్‌గా కనిపించిన టి’చల్లా (చాడ్విక్ బోస్‌మన్) మరణంతో ఈ మూవీ కథ మొదలవుతుంది. బ్లాక్ పాంథర్ లేకపోవడంతో వకాండా దేశంలో మాత్రమే లభించే అరుదైన, శక్తివంతమైన లోహమైన వైబ్రేనియంపై ప్రపంచ దేశాల కన్ను పడుతుంది. దానితో వకాండాపై దాడులు జరగడం ప్రారంభం అవుతాయి. కానీ వకాండా వాటిని తిప్పికొడుతుంది. దానితో మరెక్కడైనా వైబ్రేనియం ఉందేమోనని కనిపెట్టే మెషీన్ తో ప్రపంచమంతా గాలిస్తుంటారు. అలా వేట కొనసాగుతుండగా అట్లాంటిక్ సముద్రం అట్టడుగున కూడా వైబ్రేనియం జాడ తెలుస్తుంది. కానీ దాని కోసం వెళ్లినప్పుడు నమోర్ (టెనాక్ హుయెర్టా) సైన్యం వారిని అడ్డగిస్తుంది. ఇన్ని రోజులు రహస్యంగా ఉన్న వైబ్రేనియం సంగతి బయటపడడంతో నమోర్ వకాండాకు వచ్చి ఆ మెషీన్ కనిపెట్టినవారిని అప్పగించమని లేకపోతే యుద్ధం తప్పదని వకాండాను హెచ్చరిస్తాడు. దీంతో బ్లాక్ పాంథర్ చెల్లెలు షురి (లెటీటియా రైట్) ఆ సైంటిస్ట్ కోసం వెతికి అతన్ని కనిపెడుతుంది. ఇంతలో రిరి విలియమ్స్, షురి ఇద్దరిపై నమోర్ దాడి చేసి తీసుకెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? షురి బ్లాక్ పాంథర్‌గా ఎలా మారింది? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఓవరాల్ సినిమా గుడ్
ఓవరాల్‌గా సినిమా గురించి చెప్పాలంటే హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలు ఇష్టపడేవారు ఈ సినిమాను కచ్చితంగా చూడాల్సిందే. చాడ్విక్ బోస్‌మన్‌కు ఈ సినిమా ఘనమైన నివాళిగా ఉంటుంది.
ఇదీ చదవండి: సమంత ‘యశోద’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. డీసెంట్ ఎంగేజింగ్ ఎమోషనల్ థ్రిల్లర్