Site icon Prime9

Yashoda Twitter Review: సమంత ‘యశోద’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. డీసెంట్ ఎంగేజింగ్ ఎమోషనల్ థ్రిల్లర్

yashodha-movie-streaming-from-december-9th on amazon prime

yashodha-movie-streaming-from-december-9th on amazon prime

Yashoda Twitter Review: ‘యశోద’ మూవీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. సమంత ముఖ్య పాత్రలో నటించిన యశోద సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.యూఎస్ ప్రీమియర్లు పడటంతో అక్కడి రిపోర్ట్ ప్రకారం సినిమాలో సమంత యాక్టింగ్ మరో లెవల్ లో ఉంది అంటున్నారు. ట్విట్టర్‌లో సమంత, యశోద పేర్లు మార్మోగిపోతోన్నాయి. సమంత కష్టానికి ప్రతిఫలం వచ్చిందని  నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందిచిన  ఈ చిత్రాన్ని ఏకంగా ఐదు భాషల్లో రిలీజ్ చేశారు. ఈ మూవీని హరి- హరీష్ దర్శకత్వంలో సరోగసి బ్యాక్‌డ్రాప్‌తో తీసారు. ‘సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

సరోగసీ బ్యాక్‌డ్రాప్‌తో మొదలై , చివరికి ఓ మర్డర్‌తో థ్రిల్లర్‌గా మారుతుందని మూవీ చూసిన వాళ్లు చెప్తున్నారు. సమంత ఎంట్రీ మూవీలో చాలా సింపుల్‌గా ఉందని, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ చాలా బాగా నటించినట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ట్విట్టర్‌లో సమంత మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. యశోద మూవీలో సమంత రోల్ అబ్బురపరిచిందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్‌ మూవీ అదిరిపోయిందని, సెకండాఫ్ అంతా ఎమోషనల్‌గా సాగిందని చెప్తున్నారు. సమంత చేసిన స్టన్స్ ఆశ్చర్యపరిచేలా ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు.

ట్విట్టర్ కామెంట్స్ ఆధారంగా సినిమా ఎలా ఉందంటే, రేప్ మర్డర్ మిస్టరీతో మూవీ మొదలవుతుందంట. సరోగసీ హాస్పటల్ లో ఒక  మర్డర్ ఇన్విస్టిగేషన్‌తో మూవీ మలుపు తిరుగుతుందని మూవీ చూసిన వారు కామెంట్స్ చేశారు. ఇంటర్వెల్‌కి ముందు 20 నిమిషాల సన్నివేశాలు సినిమాకి హైలైట్‌ అని నెటిజన్లు చెప్తున్నారు. ఇంటర్వెల్ అనంతరం మూవీ థ్రిల్లర్‌గా మారిందని నెటిజన్లు అంటున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందించగా, బీజీఎం అయితే సూపర్‌గా ఉందని, యశోద సినిమాకి అదే హైలైట్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version