Site icon Prime9

Dil Raju : టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం..

tollywood producer Dil Raju father passed away shyam sundar reddy

tollywood producer Dil Raju father passed away shyam sundar reddy

Dil Raju : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు గురించి అందరికి తెలిసిందే. వరుస హిట్ సినిమాలతో ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి శ్యాంసుందర్ రెడ్డి నిన్న రాత్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా బాధ పడుతున్న శ్యాంసుందర్.. సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో తుది శ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ప్రస్తుతం ఆయన వయసు 86 సంవత్సరాలు. శ్యామ్ సుందర్ రెడ్డి స్వస్థలం నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లి గ్రామం. దిల్ రాజు తల్లి పేరు ప్రమీలమ్మ. దిల్ రాజుకు విజయ్ సింహారెడ్డి, నరసింహారెడ్డి అనే ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. దిల్ రాజు అసలు పేరు వెంకట రమణారెడ్డి. చిన్నతనం నుంచే అందరూ రాజు అనే పిలవడంతో, అదే పేరుగా ప్రచారంలోకి వచ్చింది.

వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ కు వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు దిల్ రాజు. సినీ డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించిన వెంకట రమణారెడ్డి.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి ‘దిల్’ సినిమాతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత తన పేరుగా మార్చుకొని ‘దిల్’ రాజు అయ్యారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా రాణిస్తున్నారు. ఆయన మొదటి భార్య పేరు అనిత. తన ప్రొడక్షన్ లో రూపొందే సినిమాలన్నిటికీ ఆమె సమర్పకురాలుగా ఉన్నారు. వీరికి హన్షిత రెడ్డి అనే కుమార్తె కూడా ఉంది. అయితే అనితా రెడ్డి 2017లో అనారోగ్య కారణాలతో మరణించిన తర్వాత 2020లో వైఘా రెడ్డిని దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఓ బాబు ఉన్నాడు.

Exit mobile version