Keeda Cola : టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్.. వైవిధ్యభరిత చిత్రలత ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తరుణ్.. నటుడిగా ప్రేక్షకులను పలకరిస్తున్నప్పటికి డైరెక్టర్ గా మాత్రం బ్రేక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన `కీడా కోలా` అనే చిత్రాన్ని తెరకెక్కించారు. చైతన్య రావు, రాగ్ మయూర్, బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించారు. క్రైమ్, కామెడీ జోనర్లో నడిచే ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతాన్ని అందించారు. హీరో రానా సమర్పణలో వివేక్ సుధాన్షు, శ్రీకృష్ణ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆద్యంతం ఫన్ రైడ్‌గా సాగిన ఈ ట్రైలర్.. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. ఓ షోకేస్ బొమ్మ చుట్టూ ఈ కథ నడుస్తుందని అర్థమవుతుంది. ఇందులో పొలిటికల్ డ్రామా, గ్యాంగ్ స్టర్ డ్రామా, కోర్ట్ రూమ్ డ్రామా అన్నీ మిక్స్ అయినట్లు కనబడుతుంది. ట్రైలర్ లో గమనిస్తే.. నటుడు చైతన్య టురెట్టో సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్టుగా చూపించారు. చిన్నప్పట్నుంచి వీడు దరిద్రాన్ని డ్రాయర్‌లో వేసుకుని తిరుగుతున్నాడని లాయర్ చెప్పగా, మరో లాయర్ అబ్జెక్షన్ చెబుతాడు, దీనికి ఎందుకు డ్రాయర్లు వేసుకోవడమా? అని ఫ్రెండ్ లాయర్ స్పందించడం నవ్వులు పూయిస్తుంది.
అలాగే సెకండ్ హ్యాండ్ బట్టర్, వైన్ షాప్ వద్ద పకోడి తినడం, సెకండ్ హ్యాండ్ ల్యాప్ ట్యాప్‌లు తీసుకోవడం సీన్లలో, మన దగ్గర పైసలెప్పుడు ఉండేరా సేవ్ చేయనికి అని చెప్పడం, బాటిల్‌లో ఏదో ఉందిరా అనగా, బాటిల్‌లో కోట్లు కోట్లు కొట్టే లాటరీ టికెట్ రా అని చెప్పడం ఆకట్టుకుంది. తరుణ్ భాస్కర్ జైలు నుంచి ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత వరుసగా మాఫియా దిగడం, కాల్పులు, ఫైటింగ్‌లు, ఛేజింగ్‌లు ఇలా ఆద్యంతం రైడ్‌లా సాగింది.