Last Updated:

జేమ్స్ కామెరూన్ ‘అవతార్’ … ది వే ఆఫ్ వాటర్ మూవీ రివ్యూ

జేమ్స్ కామెరూన్ ‘అవతార్’ … ది వే ఆఫ్ వాటర్ మూవీ రివ్యూ

Cast & Crew

 • సామ్ వర్తింగ్టన్ (Hero)
 • జో సల్దానా (Heroine)
 • సిగోమ్ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్‌లెట్ (Cast)
 • జేమ్స్ కామెరూన్ (Director)
 • జేమ్స్ కామెరాన్, జోన్ లాండౌ (Producer)
 • సైమన్ ఫ్రాంగ్లెన్ (Music)
 • (Cinematography)
3.5

Avatar 2 : హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన దృశ్య కావ్యం ” అవతార్ – థి వే ఆఫ్ వాటర్ “. నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 2009 లో వచ్చిన ‘అవతార్’ కి సీక్వెల్ గా 13 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అవతార్ సినిమాతో అందర్నీ విజువల్ ట్రీట్ తో కట్టిపడేసిన కామెరూన్ ఈ సినిమాతో ఇంకేం మ్యాజిక్ చేస్తారో అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మన దేశంలో అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ మూవీ చరిత్ర సృష్టించింది. నేడు ప్రపంచ వ్యాప్తంగా 52 వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ రివ్యూ మీకోసం…

సినిమా కథ …

అవతార్ సినిమాను గమనిస్తే పండోరాలో దొరికే ఉనబ్టేనియం అనే విలువైన ఖనిజాన్ని దక్కించుకోవడానికి మనుషులు ఆ గ్రహంపైకి వెళ్తారు. వారితో పాటే పండోరా గ్రహానికి వెళ్ళిన జేక్ సల్లీ పండోరాలో ఓ తెగకు చెందిన నాయకుని కూతురు నేతిరిని ప్రేమించడం, అక్కడి వారికి మానవులు అన్యాయం చేస్తున్నారని గ్రహించి వారికి ఎదురు తిరుగుతాడు. చివరకు మానవులకు – నావి వారికి యుద్ధం మొదలవుతుంది. చివరకు నావి ప్రజలే విజయం సాధించి మనుషుల్ని భూమ్మీదకు పంపించేస్తారు. దీంతో మొదటి భాగం ముగుస్తుంది. ఈ సినిమా మొదటి భాగం ఎక్కడి నుంచి అయితే ముగుస్తుందో అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది.

జేక్ సల్లీ, తన భార్య నేతిరి తండ్రి తరువాత వారి తెగకు నాయకుడై ఉంటాడు. వారికి నెటెయమ్, లోక్ అనే కొడుకులు, టక్, కిరి అనే కూతుర్లు ఉంటారు. వారితో పాటే స్పైడర్ అనే మానవ బాలుడు కూడా కలసి ఉంటాడు. మొదటి నుంచి పండోరా ప్రకృతి వనరులపై కన్నేసిన కొందరు స్వార్థపరులు మళ్ళీ భూలోకం నుండి ఆ గ్రహంపైకి దండెత్తుతారు. వారికి నాయకునిగా క్వారిచ్ నా’వి బాడీతో వస్తాడు. జేక్ గెరిల్లా దాడికి సిద్ధమవుతాడు. క్వారిచ్ మనుషులు జేక్ పిల్లలను బంధిస్తారు. జేక్ తన కుటుంబాన్ని విడిపించుకొని మెట్కాయినా ప్రాంతానికి వెళతాడు. ఆ ప్రాంతానికి వెళ్ళాక జేక్ కొడుకు లోక్ ఆ ప్రాంతనాయకుని కూతురు సిరేయాతో అనుబంధం పెంచుకుంటాడు. జేక్ పిల్లలు సముద్రంతో ఎంతో అనుబంధం పెంచుకుంటారు. క్వారిచ్ ఎలాగైనా జేక్ ను అంతమొందించాలనే చూస్తాడు. చివరకు ఏమవుతుంది ? జేక్ ను అంతమొందించాలనుకున్న క్వారిచ్ ఏం చేశాడు? వంటి ప్రశ్నలకు సమాధానంగా మిగిలిన కథ ఉంటుంది.

విశ్లేషణ …

మూడు గంటల పన్నెండు నిమిషాల నిడివి ఉన్న ఈ మూవీ మొదట్లో ఎంధుకు అనిపించినా… ఆ తర్వాత పండోరా లోని సముద్రపు అందాలు మనల్ని స్టోరీకి కట్టి పడేస్తాయి. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అవతార్ కి మించి ఐ ఫీస్ట్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు. మొదటి భాగంలో గాల్లో ఎగరడానికి ఇక్రాన్ అనే పక్షులు ఉంటాయి. ‘అవతార్ 2’లో ఈలు అనే సముద్ర జీవులు ఉంటాయి. జేక్ సల్లీ అండ్ ఫ్యామిలీ నీటిలో ఈలుని మచ్చిక చేసుకునే సీన్స్ విజువల్ గా చాలా చక్కగా ఉంటాయి. అయితే ఫస్టాప్ అంతా కూడా స్టోరీ సెట్ చేసుకోవడానికి సరిపోయింది. దీంతో సినిమా కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ సెకండాఫ్ మాత్రం ఓ వైపు యాక్షన్ సీన్స్, మరోవైపు వండర్ ఫుల్ వాటర్ విజువల్స్ తో అలరిస్తుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వచ్చే రెండు యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఇక జేక్ సల్లీ కుటుంబం తోపాటు మెట్కాయన్ ప్రజలు కలిసి చేసే పోరాటంలో సముద్ర జీవులు కలిసి పోరాడడం సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. జేమ్స్ కామెరూన్ మరోసారి ఆస్కార్ ని ఎగరేసుకుపోవడం ఖాయం అని చెప్పవచ్చు.

ఇక నటీనటుల విషయని కొస్తే…

ఫస్ట్ పార్ట్ లో కనిపించిన జేక్, అతడి భార్య నేతిరి ఈ పార్ట్ లో అంతే అద్భుతంగా నటించారు. వాళ్ల పిల్లలుగా నటించిన నలుగురు కూడా యాక్టింగ్ తో అదరగొట్టేశారు. ముఖ్యంగా దత్తత తీసుకున్న అమ్మాయి కిరి, చిన్న కొడుకు క్యారెక్టర్స్ వల్లే సినిమా మొత్తం టర్న్ అవుతుంది. ‘అవతార్’ రోల్ లో కనిపించిన మైల్స్ కూడా పర్వాలేదనిపించాడు. ఇక సినిమాలో ‘స్పైడర్’ అనే మనిషి పాత్ర కూడా అందరికీ నచ్చేస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

 • జేమ్స్ కామెరూన్ డైరెక్షన్
 • విజువల్స్
 • యాక్షన్ సీక్వెన్స్
 • కథ, కథనం
 • టైటానిక్ ఫేమ్ కేట్ విన్స్ లెట్ ఎంట్రీ

మైనస్ పాయింట్స్ :

 • స్లో నేరేషన్
 • సినిమా నిడివి

ఫైనల్ కంక్లూజన్ : విజువల్ వండర్

ఇవి కూడా చదవండి: