India Pak: పాకిస్థాన్ యూట్యూబ్ చానల్స్ ను నిషేధించిన భారత్

India Pak: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పట్టుభిగిస్తూ వస్తుంది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తు్న్న 16యూట్యూబ్ చానళ్లను భారత్ బ్యాన్ చేసింది. ఇందులో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చానల్ కూడా ఉంది. నిషేధిత ప్లాట్‌ఫామ్‌లలో డాన్, సమా టీవీ, ఏఆర్‌వై న్యూస్, బోల్ న్యూస్, రఫ్తార్, జియో న్యూస్ మరియు సునో న్యూస్ అనే వార్తా సంస్థల యూట్యూబ్ ఛానెల్‌లు ఉన్నాయి. జర్నలిస్టులు ఇర్షాద్ భట్టి, అస్మా షిరాజీ, ఉమర్ చీమా, మునీబ్ ఫరూక్‌ల యూట్యూబ్ చానల్స్ , ది పాకిస్తాన్ రిఫరెన్స్, సమా స్పోర్ట్స్, ఉజైర్ క్రికెట్ మరియు రజి నామా వంటి ఇతర హ్యాండిళ్లు నిషేధించబడ్డాయి. పహల్గాం విషాదం నేపథ్యంలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా మతపరమైన కంటెంట్, తప్పు దారిపట్టించే కథనాలు ప్రసారం చేస్తున్నాయని భారత ప్రభుత్వం పేర్కొంది.

cricketer shoaib akhtar channel also ban
పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్ కీలకపాత్ర పోషించగా భారత్ తీవ్రంగా విరుచుకు పడుతోంది. దౌత్యసంబంధాలను కఠినతరం చేయడంతో పాటు, సింధూ జలాలను ఆపివేసింది. వీసాలపై బ్యాన్ విధించింది. ఉగ్రదాడిలో పాల్గొన్నవారు, వెనకుండి నడిపించిన వారిని ఊహించలేని విధంగా శిక్షిస్తామన్నారు ప్రధాని మోదీ. ఉగ్రదాడితో భారత స్పూర్తిని విచ్చిన్నం చేయలేరని తెలిపారు. కార్గిల్ నుండి కన్యాకుమారి వరకు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. 140కోట్ల మంది సంకల్పం ఉగ్రవాదులను నామరూపాలు లేకుండా చేస్తుంది.
భరత్ ఆగ్రహానికి పాక్ సైన్యంలో వణుకు మొదలైంది. ఇప్పటికే పాకిస్థాన్ ఆర్మీ అధికారుల కుటుంబాలు దేశాన్ని వదిలివెళ్లాయి. అందులో ఆర్మీ చీఫ్ కుటుంబం కూడా ఉంది. అంతేకాకుండా వేల సంఖ్యలో పాకిస్థాన్ కు చెందిన సైనికులు సైన్యాన్ని వదిలి వెళ్తున్నారు. భారత్ లో ఏ రకంగా పోల్చినా పాక్ రెండు రోజులకంటే ఎక్కువ యుద్దం చేయలేదని యుద్ధనిపుణులు చెబుతున్నారు. పాకిస్థాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. సాయంత్రం అయితే చాలు కరెంటు కూడా ఉండని దేశం ఏకంగా భారత్ తో తలపడేందుకు సిద్ధమవుతుందని పాకిస్థాన్ ప్రజలే ఆ దేశాన్ని ట్రోల్ చేస్తున్నారు.
ANI is also on Google News Showcase.
To follow, click
https://t.co/9clQ811lP9 pic.twitter.com/NkgBB7L18m
— ANI Digital (@ani_digital) April 28, 2025