Home / జాతీయం
కృషి ఉంటే మనుషులు రుషులవుతారని, సాధించాలనే పట్టుదల ఉంటే వైకల్యం కూడా ఆయుధంగా మారుతుందని, అమృత్ సర్‌కు చెందిన అబ్లు రాజేష్ అనే యువకుడు నిరూపించారు. తన రెండు కాళ్లూ లేకపోయినా, స్ర్పింగ్ కాళ్లతో డ్యా్న్స్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
కేంద్ర విద్యుత్ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలతో సహా 13 రాష్ట్రాలకు షాక్ ఇచ్చింది. ఇండియన్ పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పోరేషన్ (పీఓఎస్ఓసీఓ)నుండి విద్యుత్ కొనుగోలు చేయకుండా నిషేధం విధించింది. ఆంధ్ర, తెలంగాణ సహా 13 రాష్ట్రాలకు చెందిన 27 డిస్కమ్‌లకు నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. దర్యాప్తులో భాగంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఢిల్లీలో 21 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
మహారాష్ట్రలో ఉగ్రవాదులు మరో భారీ కుట్రకు తెరలేపినట్టుగా కనిపిస్తోంది. ముంబై నుంచి రాయ్‌ఘడ్ వెళ్లే మార్గంలో ఉన్న హరిహరేశ్వర్ బీచ్‌లో అనుమానాస్పద బోట్లను పోలీసులు గుర్తించారు. రెండు బోట్లలో భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రి లభ్యమైంది.
భారతదేశం యొక్క జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు మరియు పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు, పాకిస్తాన్ నుండి ఆపరేట్ చేస్తున్న ఒకదానితో సహా ఎనిమిది యూట్యూబ్ ఛానెల్‌లను బ్లాక్ చేయాలని భారత ప్రభుత్వం గురువారం ఆదేశించింది.
ప్రజలు కొనగలిగే ధరలకు చమురును అందించడం భారత దేశ ప్రభుత్వం నైతిక కర్తవ్యమని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ అన్నారు. ఆత్మరక్షణ ధోరణిలో పడిపోకుండా, రష్యా నుంచి చమురును కొంటున్నామని వివరించారు. మన దేశ విధానాన్ని ఇప్పుడు ఇతర దేశాలు కూడా ఆమోదిస్తున్నాయని చెప్పారు .. బ్యాంకాక్‌లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
బీజేపీ కొత్త పార్లమెంటరీ బోర్డును, కేంద్ర ఎన్నికల కమిటి ప్రకటించింది. పార్లమెంట్ బోర్డులో కొత్తగా 11 మందికి చోటు కల్పించగా.. కేంద్ర ఎన్నికల కమిటిలో 15 మందికి అవకాశం కల్పించారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ జమ్మూ మరియు కాశ్మీర్ కమిటీ ఛైర్మన్ పదవి నుండి వైదొలిగారు. తనకు ఈ పదవికి అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆజాద్ చెప్పినప్పటికీ,
ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి ఇ పళనిస్వామికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో ద్వంద్వ నాయకత్వాన్ని పునరుద్ధరిస్తూ ఆయన బద్ధ ప్రత్యర్థి పన్నీర్ సెల్వంకు అనుకూలంగా మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది.
రూ.215 కోట్ల వసూళ్ల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను నిందితురాలిగా పేర్కొంది. ఆమె పై ఈడీ బుధవారం చార్జిషీట్ దాఖలు చేసింది. బలవంతంగా వసూలు చేసిన సొమ్ములో జాక్వెలిన్ లబ్ధిదారునిగా ఈడీ గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.