Haryana: హర్యానా లోని నూహ్ జిల్లాలో సెప్టెంబరు 15న ఉదయం 10 గంటల నుండి సెప్టెంబరు 16న రాత్రి 12 గంటల వరకు మొబైల్ ఇంటర్నెట్‌ను నిలిపివేయాలని ప్రభుత్వం శుక్రవారం ఆదేశించింది. అదనంగా, ప్రభుత్వం మొత్తం జిల్లావ్యాప్తంగా సెక్షన్ 144 ని కూడా విధించింది. ప్రజలు తమ ఇళ్ల వద్దే శుక్రవారం ప్రార్థనలు చేయాలని ప్రభుత్వం కోరింది.
జూలై 31 నాటి నుహ్ హింసాకాండకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్‌ను అరెస్టు చేసిన కొన్ని గంటల తర్వాత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి టీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు .జిల్లాలో ఉద్రిక్తత, ఆందోళన, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం వాటిల్లవచ్చని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని నూహ్ డిప్యూటీ కమిషనర్ గురువారం లేఖ రాయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రసాద్ తెలిపారు.ఇంటర్నెట్ సేవల దుర్వినియోగం కారణంగా ప్రజా వినియోగాలకు అంతరాయం, ఆస్తులు మరియు సౌకర్యాలకు నష్టం మరియు శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశముందన్నారు. తప్పుడు పుకార్లు వ్యాప్ది చెందుతున్నాయని ఆయన అన్నారు.