Last Updated:

Delhi Assembly Election 2025: ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. ఎన్నికలు ఎప్పుడంటే?

Delhi Assembly Election 2025: ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. ఎన్నికలు ఎప్పుడంటే?

Election Commission to announce dates Delhi Assembly Election 2025: ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేసింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. మొత్తం ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఈ మేరకు ఎన్నికల తేదీలను సీఈసీ ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23తో ప్రస్తుత అసెంబ్లీ గడవు ముగియనున్నందున ఫిబ్రవరి 5న ఒకే దశలో ఢిల్లీలోని 70 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కాగా, ఫిబ్రవరి 15వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ గడువు ముగియనుందని వెల్లడించారు.

ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లు ఇప్పటివరకు ఆధారాలు లేవని, ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. అలాగే ఈవీఎంలను రిగ్గింగ్ చేయడం కూడా వీలు కాదని స్పష్టంచేశారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని కోర్టులు సైతం చెప్పాయని ఈసీ వెల్లడించారు.

పోలింగ్ శాతాన్ని ఎవరూ కూడా మార్చలేరని, సాయంత్రం 5 గంటల తర్వాత ఓటింగ్ శాతం పెరుగుతుందని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ట్యాంపరింగ్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని చెప్పారు. ఓటరు జాబితాలో పేర్లను చేర్చడం, తీసివేయడం వంటివి పాటిస్తున్నామని వివరించారు.