Home / Mizoram
మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో కొండచరియలు విరిగి పడి సుమారు పది మంది మృతి చెందారు. జాతీయ రహదారి 6పై హంతూరు వద్ద రోడ్డుపై పెద్ద ఎత్తున బండ రాళ్లు పడ్డంతో జాతీయ రహదారి ధ్వంసం అయ్యింది.
మయన్మార్‌లోని తిరుగుబాటు దళాలు మరియు జుంటాల మధ్య కొనసాగుతున్న పోరుతో గత కొన్ని రోజులుగా వందలాది మంది ఆర్మీ సిబ్బంది భారత సరిహద్దును దాటి ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలోకి ప్రవేశించారు. ఈ వలసలను చూసిన మిజోరం ప్రభుత్వం మయన్మార్ సైనికులను త్వరగా పొరుగు దేశానికి తిరిగి పంపాలని కేంద్రాన్ని కోరింది.
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు వినూత్న తీర్పునిచ్చారు. ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూవ్మెంట్ ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, అధికార మిజో నేషనల్ ఫ్రంట్ ను వెనక్కి నెట్టేసింది. లాల్ దహోమా సారథ్యంలోని జోరామ్ పీపుల్స్ మూవ్‌వెంట్ 40 స్థానాల్లో 27 స్థానాలు గెలుచుకుని అధికారం ఖాయం చేసుకోగా, ఎంఎన్ఎఫ్ 10 సీట్లకే పరిమితమైంది.
మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో బారులు తీరారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలోని 90 స్థానాలకు గానూ 20 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండ కంటే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సోమవారం ఆయన మిజోరంలో మాట్లాడుతూ ఇజ్రాయెల్‌లో ఏమి జరుగుతుందనే దానిపై ప్రధానమంత్రి మరియు భారత ప్రభుత్వానికి చాలా ఆసక్తి ఉంది. కానీ మణిపూర్‌లో ఏమి జరుగుతుందో దానిపై అస్సలు ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.
మిజోరంలోని సాయిరాంగ్ ప్రాంతానికి సమీపంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోవడంతో బుధవారం కనీసం 17 మంది కార్మికులు మరణించారు.ఐజ్వాల్‌కు 21 కిమీ దూరంలో ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
గురుగ్రామ్‌లోని ఒక ఇన్స్టిట్యూట్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మిజోరం దేశం యొక్క సంతోషకరమైన రాష్ట్రం గా ప్రకటించబడింది. మొత్తంగా, విద్యార్థులు మరియు వారి ఉపాధ్యాయుల మధ్య సంబంధాలతో సహా రాష్ట్రంలో ఆనంద సూచికను కొలవడానికి ఆరు వేర్వేరు పారామితులను పరిగణించారు.
మిజోరాం సీఎం కుమార్తె మిలారీ చాంగ్టే వైద్యుడి పై దాడి చేసింది. అపాయింట్ మెంట్ లేకుండా క్లీనిక్ లోనికి అనుమతి లేదని చెప్పడంతో ఓ వైద్యుడి పై తన ప్రతాపం చూపించింది. విచక్షణ కోల్పోయిన వైద్యుడి పై దాడికి దిగింది.
నైరుతి రుతు పవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్థవ్యవస్థంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి.