Pashamylaram pharma company: పాశమైలారం ఘటనలో సజీవ దహనమైన నవ దంపతులు

Pashamylaram pharma company: పటాన్‌చెరు పాశమైలారం దుర్ఘటనలో అనేక మంది సజీవదహనం అయ్యారు. ఈ ఘటన యావత్ రాష్ట్రాన్ని కలిచివేస్తోంది. ఇదే ప్రమాదంలో కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతుల ఆచూకీ గల్లంతైంది. ఇంట్లో పెద్దలను ఒప్పించే ప్రేమ వివాహం చేసుకుందామనుకున్నా.. ఇంట్లో వారు ఒప్పుకోకపోవడంతో రెండు నెలల క్రితమే ఆర్యసమాజ్‌లో ఒక్కటయ్యారు.
కడప జిల్లా ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన గొరిగనూరు నిఖిల్ కుమార్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం పుట్రెల గ్రామానికి చెందిన రామాల శ్రీ రమ్య ఒకే ఫార్మా కంపెనీలో పనిచేస్తూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎన్నో ఆశలతో జీవితాన్ని గడపాలనుకున్న వారికి కాలం సహకరించలేదు. సిగాసీ ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్‌లో వారు చనిపోయారు. ఎంతో ఆనందంతో గడపాల్సిన దంపత్య జీవితాన్ని హఠాత్తుగా ముగించేయడంతో బంధవులు, కుటుంబీకులు, స్నేహితులను కలచివేస్తోంది.