Bhajan Lal Sharma: బీజేపీ అధిష్టానం రాజస్థాన్ నూతన సీఎంగా భజన్‌లాల్ శర్మని అధికారికంగా ప్రకటించింది. చివరి నిమిషంలో భజన్‌లాల్ పేరు తెరమీదకు వచ్చింది. బీదియా కుమారి మరియు ప్రేమ్‌చంద్ బైర్వా లను డిప్యూటీ సీఎంలుగా ప్రకటించారు.
భజన్‌లాల్ శర్మ ఎంపికతో బీజేపీ గెలిచిన మూడు రాష్ట్రాలలోనూ కొత్తవారికే సీఎంగా అవకాశం ఇచ్చింది. భజన్ లాల్ శర్మ పేరును వసుంధర రాజే ప్రకటించారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన భజన్ లాల్ శర్మ ఇటీవల ముగిసిన ఎన్నికలలో సంగనేర్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాలుగుసార్లు పనిచేశారు.అతను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) మరియు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)తో అనుబంధం కలిగి ఉన్నారు. రాజస్థాన్ సీఎం రేసులో గజేంద్ర షెకావత్, మహంత్ బాలక్‌నాథ్, దియా కుమారి, అనితా భాదేల్, మంజు బాగ్‌మార్ మరియు అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌లు పోటీ పడినప్పటికీ చివరికి బీజేపీ హై కమాండ్ చివరకు భజన్‌లాల్ శర్మని ఎంపిక చేసింది.