Site icon Prime9

Kenya: అదానీకి షాకిచ్చిన కెన్యా ప్రభుత్వం.. ఎందుకంటే?

Kenya cancels deals with Adani: కెన్యా ప్రభుత్వం గౌతమ్ ఆదానీకి షాక్ ఇచ్చింది. భారతీయ బిలియనీర్ గౌతమ్ ఆదానీకి ఇవ్వనున్న రెండు ప్రధాన ఒప్పందాలను రద్దు చేసుకుంది. ఇందులో భాగంగానే ఎయిర్ పోర్ట్ టెండర్‌కు బ్రేక్ పడింది. దీంతో పాటు విద్యుత్ సరఫరా లైన్ల కాంట్రాక్టుకు సంబంధించిన ఒప్పందం కూడా రద్దు చేసుకుంటున్నట్లు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో వెల్లడించారు.

ఇటీవల కొన్ని ప్రాజెక్టుల విషయంలో గౌతమ్ అదానీ లంచం తీసుకున్న ఆరోపణలు వస్తుండగా.. అతనిపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో కెన్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు ఆదానీతో ఆ దేశ ప్రభుత్వం విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణానికి పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం కింద దాదాపు 30 ఏళ్ల వరకు ఒప్పందం కుదుర్చుకుంది.

ఇందులో 30 ఏళ్లకు గానూ కెన్యా ప్రభుత్వం 736 మిలియన్ డాలర్లకు ఆదానీ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే కెన్యాలోని ప్రధాన విమానాశ్రయం జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయ డెవలప్ మెంట్ కోసం ఆదానీ గ్రూప్‌నకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అయితే, అమెరికాలో ఆదానీపై కేసు నమోదు కావడంతో ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత నెలకొంది. ఈ నేపథ్యంలో రెండు ప్రధానమైన ప్రాజెక్టులను నిలిపివేసింది. తాజాగా, ఆ రెండు ప్రాజెక్టులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో వెల్లడించారు.

Exit mobile version