Hyderabad: గచ్చిబౌలి మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు ఇకపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణించవచ్చు. ఈ దిశగా మార్పులు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారీ ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. త్వరలో మంత్రి కేటిఆర్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నుండి శిల్పా లేఅవుట్ వరకు నిర్మించిన నాలుగు లైన్ల ఫ్లైఓవర్ ను ఆయన చేతులమీదుగా ప్రారంభించనున్నారు.
గచ్చిబౌలి ప్రాంతంలో నిర్మించిన ఫ్లైఓవర్ లో రాష్ట్ర రాజధానిలో అత్యంత పొడువైనవిగా అధికారులు పేర్కొంటున్నారు. రెండు ప్రధాన మార్గాల్లో ఫైఓవర్ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేలమట్టం నుండి 18 మీటర్ల ఎత్తులో ఈ ఫ్లై ఓవర్లు నిర్మించారు. ఇందుకు గాను అద్భుతమైన ఇంజనీరింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. రెండు మార్గాల్లో ఒకటైన ఔటర్ రింగ్ రోడ్డు నుండి శిల్పా లేఅవుట్ వరకు ప్రధాన ఫ్లైఓవర్ పొడవు 956 మీటర్లు, అప్రోచ్ రోడ్డు పొడవు 248 మీటర్లు, ఫ్లైఓవర్ వెడల్పు 16.6 మీటర్లలతో నిర్మించారు.
అదే విధంగా కొండాపూర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వరకు ఆరు లేన్‌ల ఫ్లైఓవర్ ను నిర్మించారు. దీని పొడువు 816 మీటర్లు కాగ, ఈ రెండు భారీ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. త్వరలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ట్రాఫిక్ జంక్షన్‌లలో ఒకటైన గచ్చిబౌలిలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు కొత్త ఫ్లై ఓవర్లు ఉపయోగపడనున్నాయి. దీంతో పాటు హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ జిల్లా మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు సులభంగా గమ్యస్థానాలను చేరుకోన్నారు. నిత్యం రద్దీగా ఉండే మాదాపూర్, కొండాపూర్‌లోనూ ట్రాఫిక్ పరిస్థితి మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: CM KCR: మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీలు మొదలుపెట్టండి.. సీఎం కేసిఆర్