MLC kavitha vs ED: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ లో హై టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఉదయం నుంచే తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇది వరకే ఈ నెల 11న కవిత తొలి విచారణకు హాజరైన సందర్భంలో కూడా ఇలాంటి వాతావరణం లేదు.
ఈరోజు మాత్రం ఉదయం నుంచి కూడా ఢిల్లీలో హైడ్రామా నడుస్తోంది. ముందు ఉదయం 10 గంటలకు కవిత మీడియా సమావేశం ఉందంటూ వార్తలు బయటకు వచ్చాయి.
ఆ తర్వాత మీడియా సమావేశం 10:30 కు మారింది. కానీ అది కూడా జరగలేదు. కవిత 11 గంటలకు ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉన్నా బయటకు రాలేదు.
అసలు కవిత ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అనేది ఉత్కంఠ నెలకొంది.
ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో కవిత, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు తదితరులతో పాటు న్యాయ నిపుణులతో భేటీ అయినట్టు తెలుస్తోంది.
భేటీ అనంతరం కవిత 11:30 సమయంలో ఈడీ కోరిన సమాచారాన్ని సీనియర్ న్యాయవాది, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌తో ఈడీ అడిగిన సమాచారాన్ని పంపించారు.
తనకు అనారోగ్య కారణాలతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున విచారణకు హాజరు కాలేనని కవిత తెలిపారు.
కానీ ఈడీ మాత్రం కవిత వినతిని తోసిపుచ్చింది. ఈడీ విచారణకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది.
దీంతో కవిత నెక్ట్స్ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.
ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని.. కానీ, విచారణ అలా జరుగలేదని కవిత( (MLC Kavitha) పేర్కొన్నారు.
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే తమ మొబైల్ ఫోన్లు సీజ్‌చేశారని కవిత సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం ఓ మహిళను ఆమె ఇంటికి వెళ్లి మాత్రమే విచారించాల్సి ఉందని.. కానీ, ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ పిటిషన్‌ను విచారణకు తీసుకుంటున్నట్టు సీజేఐ ధర్మాసనం తెలిపింది.