Bahubali Scene: ఆసిఫాబాద్ జిల్లాలో బాహుబలి సీన్ ..18 నెలల పసిపాపను చేతుల్లో మోస్తూ వాగుదాటిన తండ్రి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లో బాహుబాలి సిన్ రిపీట్ అయింది. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ చిన్నారిని చేతితో పట్టుకుని వాగు దాటే సీన్ అందరికీ గుర్తుంటుంది. అదే రకంగా ఆసిఫాబాద్ జిల్లాలో ఒక తండ్రి తన కూతురికి వైద్యం చేయించేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో చేతితోనే పట్టుకుని వాగు దాటాడు.

  • Written By:
  • Updated On - September 6, 2023 / 04:15 PM IST

Bahubali Scene: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లో బాహుబాలి సిన్ రిపీట్ అయింది. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ చిన్నారిని చేతితో పట్టుకుని వాగు దాటే సీన్ అందరికీ గుర్తుంటుంది. అదే రకంగా ఆసిఫాబాద్ జిల్లాలో ఒక తండ్రి తన కూతురికి వైద్యం చేయించేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో చేతితోనే పట్టుకుని వాగు దాటాడు.

పారాసిటమాల్ ట్యాబ్లెట్లే దిక్కు..(Bahubali Scene)

.కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అనర్ పల్లి వాగులో బాహుబాలి సీన్ రిపీట్ అయింది. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న తన కూతురికి వైద్యం చేయించేందుకు ఓ తండ్రి సాహసం చేశాడు. 18 నెలల పసిపాపని చేతులపై మోస్తూ తండ్రి తిరుపతి పీకలలోతు నీళ్ళలో వాగు దాటాడు. వర్షం పడితే బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయని అనర్పల్లి చుట్టు పక్కల మూడు గ్రామాల ప్రజలు చెబుతున్నారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో అనారోగ్యానకి గురయితే తమకు ఇంట్లో ఉన్న పారాసిటమాల్ ట్యాబ్లెట్లే దిక్కని వారు చెబుతున్నారు.