Yahoo Layoffs: టెక్ కంపెనీల్లో ఉద్యోగాల ఊచకోత కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రముఖ కంపెనీ యాహూ తమ ఉద్యోగులను తగ్గించుకోనున్నట్టు ప్రకటించింది.
సంస్థలోని 1000 మంది ఉద్యోగులు లేఆఫ్స్ గురి అవుతున్నట్టు వెల్లడించింది.
అంటే మొత్తం వర్క్ ఫోర్స్ లో దాదాపు 20 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్టు తెలిపింది. సంస్థ యాడ్ టెక్ యూనిట్ పునర్నిర్మాణంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోలేదని.. లాభం లేని కంపెనీ యాడ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడం కోసమే ఈ నిర్ణయమని కంపెనీ సీఈఓ జిమ్ లాన్జోస్ చెప్పడం గమనార్హం.
కంపెనీ లాభాల్లో ఉందని.. కానీ విభజన పునర్నిర్మాణం కారణంగా ఈ లేఆఫ్స్ ప్రకటించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.
అయితే ఉద్యోగాల కోతలు ఇప్పటితో ఆగిపోలేదని.. వచ్చే 6 నెలల్లో మరో 8 శాతం ఉంటాయిని పేర్కొన్నారు.
సంస్థ కీలక యాడ్స్ బిజినెస్ అయిన డీఎస్పీలో పెట్టుబడులు కూడా తగ్గించుకోనున్నట్టు యాహూ తెలిపింది.
ప్రైవేటు ఈక్విటీ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్ మెంట్ సంస్థ 2021 లో యాహూ కొనుగొలు చేసిన విషయం తెలిసిందే.
భవిష్యత్ లో తీవ్ర ఆర్థి మాంద్యం తప్పదని భావిస్తున్న అనేక టెక్ కంపెనీలు ఇప్పుడే అప్రమత్తం అవుతున్నాయి.
కంపెనీల ఖర్చులను తగ్గించుకునేందుకు భారీ మొత్తంలో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి.
ఈ దారి లో దిగ్గజ కంపెనీలు అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విటర్ లతో సహా మరెన్నో కంపెనీలు ఉన్నాయి.
ఏడాది ఒక్క జనవరి నెలలోనే 91 వేల మంది ఉద్యోగులను తొలగించాయి.
ఉద్యోగులను భయపెడుతున్న ఆర్ధిక మాంద్యం.
రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు ఊడిపోయే అవకాశం.
ఐటీ రంగంలో ఇప్పటికే వేలాదిగా ఉద్యోగాల కోత.
డెల్, జూమ్, డిస్నీలో భారీగా లే ఆఫ్స్.
వేతనాల్లో కోత విధించిన ఇంటెల్.