Israeli Strike on Gaza School: సెంట్రల్ గాజాలోని నుసిరత్ క్యాంప్‌లో శరణార్దుల శిబిరంగా నిర్వహించబడుతున్న పాఠశాలపై ఇజ్రాయెల్ మిలటరీ చేసిన దాడుల్లో 15 మంది మరణించినట్లు గాజా లోని సివిల్ డిఫెన్స్ ఏజన్సీ తెలిపింది.ఇజ్రాయెల్ మిలటరీ వైమానిక దళం అబు అరబన్ పాఠశాల భవనం ప్రాంతంలో పలువురు ఉగ్రవాదులపై దాడి చేసిందని ఈ భవనం ఇజ్రాయెల్ సేనలపై దాడులకు స్దావరంగా పనిచేసిందని పేర్కొంది.
హమాస్ సైనిక అవసరాల కోసం పాఠశాలలు, ఆసుపత్రులు మరియు ఇతర ప్రజా మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తుందని ఇజ్రాయెల్ పేర్కొంది. హమాస్ ఈ ఆరోపణలను ఖండించింది. పాలస్తీనియన్ శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి రిలీఫ్ ఏజెన్సీ (UNRWA) ప్రతినిధి జూలియట్ టౌమా మాట్లాడుతూ యుద్ధం ప్రారంభమైనప్పుడు మేము పాఠశాలలను మూసివేసాము. అవి ఆశ్రయాలుగా మారాయని తెలిపారు. ఫ్రాన్స్ మరియు జర్మనీ కూడ పాఠశాలలపై దాడులు జరుగుతుండటం పట్ల విచారణకు పిలుపునిచ్చాయి.