Last Updated:

Viral News: మహిళ ప్రాణం కాపాడిన స్మార్ట్ వాచ్.. కట్టుకున్న భర్తే సజీవ సమాధి చేశాడు..!

సరికొత్త ఫ్యూచర్లతో వస్తోన్న కొంగొత్త టెక్నాలజీ వస్తువులు మనుషులను పలు విపత్కర పరిస్థితుల నుంచి రక్షిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ ఓ మహిళ పాలిట యాపిల్ వాచ్ దైవంగా మారింది. కట్టుకున్న భర్త చేతిలో మృతిచెందకుండా ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఆమెను కాపాడింది.

Viral News: మహిళ ప్రాణం కాపాడిన స్మార్ట్ వాచ్.. కట్టుకున్న భర్తే సజీవ సమాధి చేశాడు..!

Viral News: సరికొత్త ఫ్యూచర్లతో వస్తోన్న కొంగొత్త టెక్నాలజీ వస్తువులు మనుషులను పలు విపత్కర పరిస్థితుల నుంచి రక్షిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ ఓ మహిళ పాలిట యాపిల్ వాచ్ దైవంగా మారింది. కట్టుకున్న భర్త చేతిలో మృతిచెందకుండా ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఆమెను కాపాడింది. మరి ఈ ఘటన ఎక్కడ జరిగిందో చూసెయ్యండి.

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని వాషింగ్టన్‌కి చెందిన యంగ్‌ సూక్‌ ఆన్‌ అనే 42 ఏళ్ల మహిళ తన భర్త చాయ్ క్యోంగ్‌తో గత కొంతకాలంగా గొడవపడతూ, ఇద్దరూ విడిపోవాలనుకున్నారు. అయితే విడిపోతే ఎక్కడ ఆమెకు భరణం ఇవ్వాల్సివస్తుందో అని దుర్భుద్ధితో ఆలోచించిన ఆమె భర్త తనను చంపాలని నిర్ణయించుకున్నాడు.
అనుకున్నదే తడువుగా పథకం ప్రకారం చాంగ్‌ క్యోంగ్‌ ఆమె ఇంటికి వచ్చి తనతో గొడవపడి తీవ్రంగా ఆమెను హింసించి టేప్‌తో తనను చుట్టి గ్యారెజ్‌ వద్దకు ఈడ్చుకుని వెళ్లాడు. ఆ తర్వాత ఆమెను కార్‌వ్యాన్‌లో ఎక్కించుకుని ఒక అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి సజీవ సమాధి చేశాడు. అయితే ఈ క్రమంలోనే ఆమె తన చేతికి ఉన్న యాపిల్‌ వాచ్‌ సాయంతో తన 20ఏళ్ల కూతురుకి మరియు అత్యవసర నెంబర్‌ 911కి కాల్‌ చేసింది. దానితో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వాషింగ్టన్‌లోని సీటెల్‌కు 60 మైళ్ల దూరంలో ఆమెను గుర్తించి రక్షించారు. కాగా ఆమె అప్పటికే తీవ్ర అశ్వస్థకు గురై కొన ప్రాణాలతో కొట్టుకుంటోందని అధికారులు వెల్లడించారు. సమయానికి వాచ్ సూచనమేరకు అందరూ అప్రమత్తమవ్వడంతోనే యంగ్ సూక్ ను సురక్షితంగా రక్షించగలిగినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి రాముడి గుణగణాలు వివరిస్తూ కుప్పకూలిన వ్యక్తి.. వీడియో వైరల్

ఇవి కూడా చదవండి: