PSLV C55 Rocket Launch : శ్రీహరికోట లోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి చేసిన పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(పీఎస్‌ఎల్‌వీ)-సి55 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రారంభమైన ఈ కౌంట్‌డౌన్ ప్రక్రియ.. నిరంతరాయంగా 25.30 గంటల పాటు కొనసాగిన తర్వాత మధ్యాహ్నం 2.20 గంటలకు పీఎస్‌ఎల్‌వీ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రయోగంలో సింగపూర్ కు చెందిన టెలీయోస్-2, లూమోలైట్-4 శాటిలైట్స్ ను ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి పంపించారు. కాగా 741 కిలోల బరువుగల టెలీయోస్-2, 16 కిలోల లూమోలైట్-4 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ మోసుకెళ్లింది. సింగపూర్ ప్రభుత్వానికి చెందిన ఉపగ్రహం టెలీయోస్-2 లో సింథటిక్ ఎపర్చర్ రాడార్ పేలోడ్ ఉంది. ఈ ఉపగ్రహం అన్ని వాతావరణ పరిస్థితుల్లో కవరేజీ అందించగలదు. ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇన్ఫోకామ్ రీసెర్చ్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లోని శాటిలైట్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో రూపొందించిన లూమాలైట్-4 ఉపగ్రహం.. సింగపూర్ ఈ-నావిగేషన్ సముద్ర భద్రతను పెంపొందించడం, ప్రపంచ షిప్పింగ్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంతో ప్రయోగించారు.
PSLV- C55/TeLEOS-2 mission is accomplished successfully.
In a textbook launch, the vehicle placed TeLEOS-2 and LUMELITE-4 satellites precisely into their intended 586 km circular orbit.@NSIL_India@PIB_India
— ISRO (@isro) April 22, 2023