Site icon Prime9

ISRO GSLV-F12 : ఇస్రో మరో విజయం.. GSLV-F12 రాకెట్ ప్రయోగం సక్సెస్‌

ISRO GSLV-F12 rocket launch mission successful

ISRO GSLV-F12 rocket launch mission successful

ISRO GSLV-F12 : ఇస్రో చేపట్టిన జీఎస్‌ఎల్వీ – ఎఫ్‌ 12 రాకెట్ ప్రయోగం విజయవంతంగా పూర్తి అయ్యింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం వేదికగా జరిగిన ఈ ప్రయోగంలో జీఎస్‌ఎల్వీ – ఎఫ్‌ 12 రాకెట్‌ నింగి లోకి దూసుకెళ్లి.. 2వేల 232 కిలోల బరువుతో NVS -01 ఉపగ్రహాన్ని మోసుకెళ్లి నిర్ణీత వ్యవధిలో కక్ష్యలో ప్రవేశపెట్టింది. దాదాపు 19 నిమిషాల ప్రయాణం తర్వాత.. ఎన్‌వీఎస్-O1 ఉపగ్రహం ఖచ్చితంగా జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టబడిందని ఇస్రో పేర్కొంది. ఇక ప్రయోగం సక్సెస్ కావడం పట్ల పలువురు ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తున్నారు.  

ముందుగా నిర్ణయించినట్లుగానే ఉదయం 10:42 గంటలకు ఈ ప్రయోగం చేపట్టింది ఇస్రో. కౌంట్‭డౌన్ నిర్వహించే ప్రక్రియ ఆదివారం ఉదయమే ప్రారంభమైంది. 27.30 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగిన అనంతరం రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఎల్ఐ బ్యాండ్‌లో కొత్త సేవలను ఈ శాటిలైట్ అందిస్తుంది. ఇది భారత ప్రధాన భూభాగం చుట్టూ సుమారు 1500 కిలోమీటర్ల మేర రియల్ టైం పొజిషనింగ్ సేవలు అందిస్తుంది. మొత్తం ప్రయోగాల ప్రక్రియ మొత్తం ఇప్పటి వరకూ జీపీఎస్‌పై ఆధారపడిన మనం ఇకపై దేశీయ నేవిగేషనల్ సేవలు పొందొచ్చు.

ఇండియయన్ రీజినల్ నావిగేషన్ సిస్టంను మరింత బలోపేతం చేసేందుకు ఎన్‌వీఎస్-01 పేరుతో నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టారు. ఎన్‌వీఎస్-01 ఉగ్రహం.. ఎల్-5, ఎస్- బాండ్ సిగ్నల్స్‌లతో పనిచేసే విధంగా రూపొందించారు. దీని (ISRO GSLV-F12) జీవితకాలం 12 ఏళ్లు.  భారత రక్షణరంగానికి, పౌర విమానయాన రంగానికి ఇస్రో అభివృద్ధి చేస్తున్న IRNSS ఎంతో మేలు చేయబోతోంది.

అమెరికా అందిస్తున్న GPS తరహా నేవిగేషన్ కోసం భారత్‌ కొన్నేళ్లుగా IRNSS నావిక్ ప్రోగ్రాం ని నిర్వహిస్తుంది. అందులో భాగంగానే NVS 1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెడుతున్నారు. IRNSS మొత్తం ఏడు ఉపగ్రహాల ప్రయోగం. ఇందులో భాగంగా గతంలో పంపిన నాలుగు ఉపగ్రహాల జీవితకాలం ముగిసింది. ఆ సిరీస్‌లో భాగంగానే ఈ ఎన్‌వీఎస్‌ ఉపగ్రహాన్ని పంపేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. వాటికి కొనసాగింపుగా IRNSS రెండో తరం నేవిగేషన్‌ శాటిలైట్ సిరీస్‌లో ఇప్పుడు పంపుతున్న NVS-1 మొదటిది కావడం గమనార్హం. ఇక ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ఈ సిరీస్‌లో మరిన్ని శాటిలైట్లు ప్రవేశపెడతారని తెలుస్తుంది.

 

 

Exit mobile version