NTR – Hrithik Roshan : ఇదేం అప్డేట్ రా బాబు నరాలు కట్ అయిపోతున్నాయ్.. “వార్ 2” లో ఎన్టీఆర్ -హృతిక్
ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో "సినీమాటిక్ యూనివర్స్" అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. హాలీవుడ్ సినిమాల్లో ఈ రకమైన సినిమాలను ఇన్నాళ్ళూ గమనించాం. ఈ పోకడ ఇప్పుడు ఇండియాకి కూడా వచ్చేసింది. మేకర్స్ అంతా కూడా తమ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమం లోనే ఇప్పటికే ఒక కథని మరో కథతో లింక్ చేస్తూ పలు సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి.

NTR – Hrithik Roshan : ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో “సినీమాటిక్ యూనివర్స్” అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. హాలీవుడ్ సినిమాల్లో ఈ రకమైన సినిమాలను ఇన్నాళ్ళూ గమనించాం. ఈ పోకడ ఇప్పుడు ఇండియాకి కూడా వచ్చేసింది. మేకర్స్ అంతా కూడా తమ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమం లోనే ఇప్పటికే ఒక కథని మరో కథతో లింక్ చేస్తూ పలు సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. తమిళ్ లో ఈ విధంగా వచ్చిన విక్రమ్, హిందీలో పఠాన్ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాయి. విక్రమ్ సినిమాలో ఖైదీని లింక్ చేయగా.. పఠాన్ లో టైగర్ సల్మాన్ ని లింక్ చేశారు. అలాగే అజయ్ దేవ్ గన్, అక్షయ్ కుమార్, రణ్ వేర్ సింగ్ కాప్ యూనివర్స్ క్రియేట్ చేశారు. ప్రభాస్ హీరోగా చేస్తున్న ప్రాజెక్ట్ కె కూడా ఇదే కాన్సెప్ట్ తో రానుంది.
కాగా బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ యష్ రాజ్ ఫిలిమ్స్ కూడా ఇటీవల తమ సినిమాటిక్ యూనివర్స్ కి తెర లేపారు. ఈ నిర్మాణ సంస్థలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్స్ ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, వార్ సినిమాలు సూపర్ హిట్టుగా నిలిచాయి. దీంతో ఇప్పుడు ఈ యూనివర్స్ లో వచ్చే తదుపరి ప్రాజెక్ట్స్ ని అధికారికంగా అనౌన్స్ చేసింది. టైగర్ – 3, వార్ -2, టైగర్ v/s పఠాన్.. అనే మూడు ప్రాజెక్ట్స్ ని ప్రకటించారు. ఆల్రెడీ టైగర్ – 3 మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. వార్ సీక్వెల్ ఈ ఏడాది చివరిలో పట్టాలు ఎక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. వార్ 2 సినిమా టైగర్ 3 కి కొనసాగింపుగా తెరకెక్కబోతుండగా.. టైగర్ v/s పఠాన్ టైటిల్ బట్టి ఈ సినిమాలో షారుఖ్ అండ్ సల్మాన్ ఒకరితో ఒకరు పోటీ పడబోతున్నట్లు తెలుస్తుంది. అయితే వార్ 2 కి సంబంధించి ఇప్పుడు ఒక వార్త బయటికి వచ్చింది. దీంతో ఇదే అప్డేట్ రా బాబు నరాలు కట్ అయిపోతున్నాయ్ అంటూ నెటిజన్ల కామెంట్ చేస్తున్నారు.
ఇంతకీ విషయం ఏంటంటే (NTR – Hrithik Roshan)..
హృతిక్ రోషన్ తో వార్ 2 సినిమాని నెక్స్ట్ సెట్స్ పైకి తీసుకోని వెళ్లడానికి రెడీ అయిన యష్ రాజ్ ఫిల్మ్స్, ఈ సినిమాలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని స్పెషల్ రోల్ కోసం కాస్ట్ చేసినట్లు సమాచారం. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలిసి కనిపించబోతున్నారని అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ప్రొడ్యూసర్ ఆదిత్య కపూర్ వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ కాకుండా ఎన్టీఆర్ vs హృతిక్ ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్న ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వార్త బయటకి రాగానే ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. డాన్స్ విషయంలో ఇండియా బెస్ట్ డాన్సర్స్ లో వీరిద్దరూ ఖచ్చితంగా ఉంటారు. ఇక నటన విషయంలో ఎన్టీఆర్, హృతిక్ అని ఊహించుకుంటేనే గూస్ బంప్స్ రావడం గ్యారంటీ అనిపిస్తుంది.
IT’S OFFICIAL… HRITHIK – JR NTR IN ‘WAR 2’… #YRF pulls off a casting coup… #HrithikRoshan and #JrNTR will share screen space for the first time in #War2… #AyanMukerji directs. #YRFSpyUniverse pic.twitter.com/rGu8Z3Nzs7
— taran adarsh (@taran_adarsh) April 5, 2023
ఇవి కూడా చదవండి:
- Kerala Train fire case: కేరళ రైలు అగ్ని ప్రమాదం కేసు.. పరారీలో ఉన్న నిందితుడు సైఫీ ఎలా దొరికాడంటే..
- Harish Rao: పట్టపగలే దొరికిన దొంగ ‘బండి సంజయ్’.. హరీష్ రావు కామెంట్స్
- Actor Kiccha Sudeep: బీజేపీ తరపున పోటీ చేయను.. ప్రచారం మాత్రం చేస్తాను.. కన్నడ నటుడు కిచ్చా సుదీప్