NEET UG 2023: దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ప్రాథమిక కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ పరీక్ష భారత్ తో పాటు పలు విదేశాల్లో మే 7 న ఈ పరీక్ష జరిగింది. ఓవరాల్ గా 4097 సెంటర్లలో పరీక్ష నిర్వహించగా 20,87,449 మంది విద్యార్థులు హాజరయ్యారు. నీట్ యూజీ జరిగిన 28 రోజుల తర్వాత అధికారులు ప్రాథమిక విడుదల చేశారు. ప్రొవిజినల్ ఆన్సర్ కీ తో పాటు ఓఎంఆర్ ఆన్షర్ షీట్లు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఆన్షర్ కీ పై ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఛాలెంజ్ చేసేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు.
అభ్యంతరాల కోసం జూన్ 6 రాత్రి 11.50 గంటల వరకు విద్యార్థులు ఛాలెంజ్ చేసే వీలు ఉంది. అయితే ఒక్కో సమాధానాన్ని ఛాలెంజ్ చేయాలంటే రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. కీ పై విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత.. త్వరలోనే ఫలితాలను విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, గతంలో ట్రెండ్స్‌ను ఆధారంగా చేసుకొని ఈ వారం రోజుల్లోనే నీట్ (యూజీ) ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు అంచనా.