Junk Food: జంక్ ఫుడ్ తో అన్నీ నష్టాలే..
ఈ రోజుల్లో పిల్లలు, పెద్దలు అందరూ ఎక్కువగా తినేది జంక్ ఫుడ్. జీవన శైలిలో వస్తున్న మార్పులు, ఆన్ లైన్ ఫుడ్ డెలివరీలతో వీటిని తినే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ జంక్ ఫుడ్ తినడం వలన దీర్ఘకాలంలో పలు రుగ్మతలు చోటు చేసుకుంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి అయితే పరవాలేదుగాని,
Junk Food: ఈ రోజుల్లో పిల్లలు, పెద్దలు అందరూ ఎక్కువగా తినేది జంక్ ఫుడ్. జీవన శైలిలో వస్తున్న మార్పులు, ఆన్ లైన్ ఫుడ్ డెలివరీలతో వీటిని తినే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ జంక్ ఫుడ్ తినడం వలన దీర్ఘకాలంలో పలు రుగ్మతలు చోటు చేసుకుంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి అయితే పరవాలేదుగాని, ఇది అలవాటు అయితే మాత్రం ప్రమాదమేనని వారు చెబుతున్నారు. జంక్ ఫుడ్ తో కలిగే అనర్దాలను ఈ క్రింది విధంగా చెప్పుకోవచ్చు.
ఊబకాయం..
జంక్ ఫుడ్‌లో చక్కెర, కేలరీలు మరియు కొవ్వు ఎక్కువగా వుంటాయి. ఇవి బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. ఊబకాయం మధుమేహం, కీళ్ల అసౌకర్యం మరియు గుండె జబ్బులతో సహా అనేక రకాల ఇతర రుగ్మతలకు జంక్ ఫుడ్ కారణమవుతుంది.
మానసిక ఆరోగ్యం క్షీణించడం..
జంక్ ఫుడ్ మెదడులో రసాయన ప్రతిస్పందనలను ఉత్పత్తి చేసి దాని పనితీరును దెబ్బతీస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలను కోల్పోవడంతో ఒత్తిడిని ఎదుర్కోలేక డిప్రెషన్ కు లోనయ్యే అవకాశముంది.
జ్ఞాపకశక్తి కోల్పోవడం..
అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం, జంక్ ఫుడ్ వ్యక్తుల జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది. దానితో మెదడు బలహీనంగా మారుతుంది.
అందువలన ఇన్ని సమస్యలకు కారణమయే జంక్ ఫుడ్ ను నివారంచడం చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు.