New Engineering fees: తెలంగాణ వ్యాప్తంగా కొత్త ఇంజినీరింగ్ కాలేజీల ఫీజు విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మూడేళ్ల పాటు కొనసాగనున్న కొత్త ఫీజు విధానంలో అత్యధికంగా రూ. 1.60 లక్షలు, అత్యల్పంగా రూ. 45వేలుగా ప్రభుత్వం పేర్కొనింది.
ఏఎఫ్ఆర్సీ సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని 159 కాలేజీలకు సంబంధించిన ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవోలో పొందుపరిచింది. ఎంజీఐటి రూ. 1.60లక్షలు, సీవీఆర్ రూ. 1.50లక్షలు, సీబీఐటీ, వర్ధమాన్, వాసవీ కాలేజీల్లో రూ. 1.40లక్షలుగా నిర్ణయించారు. కనీస రుసంగా రూ. 45వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త నిర్ణయంతో లక్ష రూపాయలు దాటిన ఇంజినీరింగ్ కాలేజీల సంఖ్య 40కు చేరుకోవడం గమనార్హం.
అయితే ఇప్పటివరకు ఎంతమేరకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చామని కాని, పెంచిన కాలేజీ రుసుములకు తగ్గట్టుగా ఫీజు రీయింబర్స్ మెంట్ ఎంత ఉండబోతుంది అనే విషయాన్ని తర్వలో అధికారులు ప్రకటించనున్నారు. ఈ వారంలోనే ఇంజినీరింగ్ విద్యకు సంబంధించిన చివరి కౌన్సిలింగ్ జరగనుంది.
ఇది కూడా చదవండి: తెలంగాణలో రెండు ఆర్టీసి డిపోలు మూసివేత